Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
చెట్టినాడ్ స్టైల్ టమాటో పుదీనా చట్నీ..ఇడ్లీ,దోశెలలోకి దీన్ని మించినది లేదు,ఇలా చేసుకోండి
చెట్టినాడ్ వంటకాలకు పేరు పెట్టక్కర్లేదు. కళ్లు మూసుకొని తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటాయి. చెట్టినాడ్ అంటే తమిళనాడులోని శివగంగా జిల్లాలోని 56 గ్రామాలను, పుదుకోట్టైలోని 20 గ్రామాలను కలిపి చెట్టినాడ్ అని పిలుస్తారు. చెట్టినాడ్ వంటకాల రుచి, ప్రత్యేకత దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందాయి.
ఇడ్లీ, దోసెలలోకి రెగ్యులర్ గా ఒకే రకమైన చేయడానికి బదులుగా చెట్టినాడ్ స్టైల్ చట్నీని చాలామంది ఇష్టపడతారు. అటువంటి రుచికరమైన చెట్టినాడ్ చట్నీలలో ఒకటి టొమాటో పుదీనా చట్నీ. చెట్టినాడ్ స్టైల్ టమాటో పుదీనా చట్నీకి ఉల్లిపాయ, వెల్లుల్లి, కొబ్బరి వంటివి ఏమీ అవసరం లేదు. చెట్టినాడ్ టమోటో పుదీనా చట్నీ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

టమాటో పుదీనా చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-తరిగిన టమోటాలు 1 కప్పు
-పుదీనా ఆకులు 1/4 కప్పు
-కొత్తిమీర 1/4 కప్పు
-జీలకర్ర 1 టేబుల్ స్పూన్
-ఎర్ర మిరపకాయలు 5
- నూనె 1టేబుల్ స్పూన్ వేయించడానికి, 1 టేబుల్ స్పూన్ మసాలా కోసం
- ఆవాలు 1/2 టేబుల్ స్పూన్
-కరివేపాకు
-ఉప్పు
చెట్టినాడ్ టమాటో పుదీనా చట్నీ తయారీ విధానం
- ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేయాలి. జీలకర్ర చిమ్మినప్పుడు మిరపకాయలు వేసి కొన్ని నిమిషాలు వేయించాలి.
- ఇప్పుడు పుదీనా, కొత్తిమీర తరుగు వేసి కొద్దిగా వేయించాలి.
- ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన టొమాటోలు వేసి అవి మెత్తబడే వరకు వేయించాలి.
- టొమాటోలు బాగా ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి అవసరమైనంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేయకూడదు, పుదీనా, కొత్తిమీర ఆకులు కొద్దిగా కనిపించాలి.
- చట్నీని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి.
-ఇప్పుడు చట్నీ మసాలా రెడీ చేసుకోవాలి.ఇందుకోసం ఒక పాన్ లో 1 స్పూన్ ఆయిల్ పోసి ఆవాలు వేసి, పోపు గింజలు వేసి తర్వాత చట్నీ అందులో పోయాలి.
- సూపర్ చెట్టినాడ్ టమోటో పుదీనా చట్నీ రెడీ. ఇది ఇడ్లీ, దోసెలలో దీన్ని తింటే ఎన్నైనా తినేయొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications