Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ప్రపంచంలోనే బెస్ట్ చికెన్ వంటకం ఇదే.. ఒక్కసారి తింటే ఫిదా అవ్వాల్సిందే.. ఎలా చేసుకోవాలంటే?
చికెన్ వంటలు ఎంత తిన్నా బోర్ కొట్టాడు. చికెన్ కర్రీ అయినా, చికెన్ బిర్యాని అయినా, చికెన్ రోస్ట్ అయినా, తందూరి అయినా ఏమాత్రం బోర్ కొట్టకుండా ప్రతిరోజూ తినే వారు ఉన్నారు కూడా. ఈ చికెన్ రెసిపీల్లో ఒకటి చికెన్ 65. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. కొంచెం కారంగా, కొంచెం పుల్లగా ఉండే ఈ వంటకాన్ని ఇష్టపడని మాంసప్రియుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ చికెన్ 65 ప్రపంచంలోనే ఉత్తమైన వంటకాల్లో ఒకటిగా నిలిచింది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలతో పాటు దీనిని ఎలా చేసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మూడో స్థానంలో చికెన్ 65
ప్రపంచంలోనే బెస్ట్ ఫ్రైడ్ చికెన్ డిష్‌గా చికెన్ 65 నిలిచింది. ఇటీవలే ప్రపంచంలోనే బెస్ట్ వంటకాల జాబితాను విడుదల చేసిన వరల్డ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల బెస్ట్ ఫ్రైడ్ చికెన్ డిష్‌ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మన దేశానికి చెందిన చికెన్ 65 మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అగ్ర స్థానంలో కొరియన్ ఫ్రైడ్ చికెన్ ఉండగా.. జపాన్‌కు చెందిన కరేజ్ రెండో స్థానంలో ఉంది. కాగా ఈ చికెన్ 65 వంటకం గతేడాది పదో స్థానంలో ఉండగా.. ఈ ఏడాది మూడో స్థానంలోకి రావడం చాలా గొప్ప విషయం.

ఈ చికెన్ 65 తమిళనాడుకు చెందినగా చెబుతుంటారు. తమిళనాడులో ఈ వంటకం పుట్టిందనే ఆనవాళ్లు ఉన్నాయి. దేశంలోని ప్రతి కార్నర్‌లో ఈ వంటకాన్ని ఇష్టపడుతూ తింటుంటారు. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. దీనిని అల్లం, నిమ్మకాయ, కొన్ని మసాలాలు, ఎండు మిర్చి లాంటి తదితర పదార్థాలతో తయారు చేస్తారు.
చికెన్ 65 ఎలా తయారు చేస్తారంటే?
ఈ చికెన్ 65 తయారు చేసుకోవడానికి బోన్‌లెస్ చికెన్ తీసుకోవాలి. ఆ చికెన్‌ను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ చికెన్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర, చిటికెడు పసుపు, కార్న్ ఫ్లోర్, నిమ్మరసం, ఒక గుడ్డు, రుచికి సరిపడా ఉప్పు, ఇతర మసాలాలు కలుపుకొని పెట్టుకోవాలి. అలా కలుపుకొని పెట్టుకున్న చికెన్‌ను ఒక అరగంట నుంచి గంట పాటు పక్కన ఉంచుకోవాలి.
ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయిలో చికెన్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ లేత బంగారు రంగులోకి వచ్చాక ఆ చికెన్‌ను ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. అలా మిగిలిన చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ మొత్తం ఫ్రై చేసుకోవడం పూర్తయ్యాక ఆ నూనెలోనే కొన్ని కరివేపాకులను కూడా వేపుకొని చికెన్‌పై వేసుకుంటే చికెన్ 65 సిద్ధమైనట్లే. దీనిని అలానే తినేయొచ్చు లేకపోతే టమోటో సాస్‌తో కూడా తినొచ్చు. రుచి మాత్రం అదిరిపోతుంది అంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications