Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
Chicken majestic: చికెన్ మెజెస్టిక్..జిందగీలో మర్చిపోలేని టేస్ట్.. చేయడం చాలా ఈజీ
నాన్ వెజ్ లో అందరికీ ఇష్టమైనది చికెన్. చికెన్ తో అనేక రకాల వెరైటీలను చేసుకోవచ్చు. అందులో ఒకటి చికెన్ మెజెస్టిక్. దీనిని చాలా తక్కువ సమయంలోనే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఒక్కసారి దీని టేస్ట్ చూశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. చికెన్ మెజెస్టిక్ ను చేసి పెడితే ఇంటిళ్లపాది వండినవాళ్లకు ఫిదా అయిపోతారు. స్టఫ్ లోకి లేదా టచ్చింగ్ లోకి అయితే ఇది మరింత అద్భుతంగా ఉంటుంది. చికెన్ మెజెస్టిక్ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
చికెన్ మెజెస్టిక్ తయారీకి కావాల్సిన
పదార్థాలు
-బోన్ లెస్ చికెన్
-పచ్చిమిర్చి
-మిరియాల పొడి
-పెరుగు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-ధనియాల పొడి
-కారం
-ఉప్పు
-పసుపు
-నిమ్మరసం
-మొక్కజొన్న పిండి
-కోడి గుడ్డు
-వెల్లుల్లి
-ఉల్లిపాయ
-ఆయిల్
-కరివేపాకు
-కొత్తిమీర
-సోయా సాస్

చికెన్ మెజెస్టిక్ తయారీ విధానం
-ముందుగా అరకేజీ బోన్ లెస్ చికెన్ తీసుకోండి. ఆ చికెన్ ను పొడవు ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ ముక్కలు కుర్ కురే మాదిరి ఉండాలి.
-కట్ చేసిన చికెన్ ముక్కలను ఓ బౌల్ లో వేసి అందులో 1 టీస్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు,1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్,1 టీస్పూన్ అంత నిమ్మరసం,7 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్(మొక్కజొన్న పిండి), 2 కోడిగుడ్డు పగలగొట్టి వేసి అన్నీ బాగా కలిసేటట్లు చేతిలో కలపి బౌల్ మీద మూతపెట్టి అరగంట పక్కనపెట్టాలి.
-తర్వాత 10-12 పచ్చిమిర్చిని డైమండ్ షేపులో కట్ చేసి పక్కనపెట్టుకోండి.
-1 మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనపెట్టుకోండి.
-1 పెద్ద వెల్లుల్లిపాయను తీసుకొని పొట్టు తీసి వాటిని సన్న ముక్కలుగా కట్ చేసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై చేసుకోడానికి తగినంత ఆయిల్ పోసి అది కొంచెం వేడయ్యాక అందులో అరగంట పాటు పక్కన పెట్టిన చికెన్ ముక్కలను వేసి 2-3 నిమిషాలు డీప్ ఫ్రై చేసుకోండి.
-బంగారు గోధుమ రంగులోకి చికెన్ ముక్కలు వచ్చిన తర్వాత వాటిని బాండీలో నుంచి ఓ ప్లేట్ లో తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు చికెన్ వేయించిన ఆయిల్ మొత్తం తీసేసి అదే బాండీలో మళ్లీ 3 టేబుల్ స్పూన్ల ప్రెష్ ఆయిల్ సోయండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో కట్ చేసి ఉంచిన వెల్లుల్లి వేసి 1 నిమిషం వేయించాలి.. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఇంకో నిమిషం వేయించాలి.. తర్వాత అందులో కట్ చేసిన ఉల్లిపాయలు వేసి మరో నిమిషం పాటు వేయించాలి.
-తర్వాత అందులో కప్పు, కరివేపాకు,కప్పు జీడిపప్పు వేయండి. కరివేపాకు వేగిన తర్వాత అందులో 1 టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం వేసి మొత్తం కలిసేట్లు గరిటతో కలుపుకోండి. తర్వాత అందులో 1 కప్పు పెరుగు,సరిపడా ఉప్పు వేసి పెరుగు పూర్తిగా కలిసేంతవరకు కలపుకోండి.
-తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్(dark soya sauce)వేసి కలిపిన తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి కలుపుతూ 2 నిమిషాలు వేయించుకోండి.
-తర్వాత అందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చికెన్ మెజెస్టిక్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications