ఎముకల బలానికి, రక్తహీనతకి చెక్ పెట్టే హెల్తీ చాక్లెట్ లడ్డూ..రోజుకొకటి తింటే డాక్టర్ తో పనే ఉండదు!

Posted By:

సాయంత్రం కాగానే ఏదైనా తినాలనిపించడం, ముఖ్యంగా తీపి పదార్థాల మీద మనసు మల్లడం చాలా సహజం. కానీ స్వీట్స్ తింటే బరువు పెరుగుతామనో, లేదా ఆరోగ్యానికి మంచిది కాదనో చాలామంది తమ కోరికను చంపుకుంటారు. అలాంటి వారి కోసం కమ్మగా తినగలిగే అద్భుతమైన రెసిపీ చాక్లెట్ ప్రోటీన్ లడ్డూ. ప్రోటీన్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండే ఈ లడ్డూలను పిల్లలు కూడా వదిలిపెట్టకుండా ఎంతో ఇష్టంగా తింటారు.

Chocolate Protein Ladoo No Sugar No Jagegry Calcium Iron Rich Laddu at Home Recipe in Telugu

చాక్లెట్ ప్రోటీన్ లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు

వేయించిన పల్లీలు- 1 కప్పు
ఓట్స్ - 1 కప్పు
జీడిపప్పు - పావు కప్పు
నువ్వులు - పావు కప్పు
కోకో పౌడర్ - అర కప్పు
గింజలు తీసిన ఖర్జూరాలు - 1 కప్పు
నెయ్యి - 1 లేదా 2 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - అర టీస్పూన్

చాక్లెట్ ప్రోటీన్ లడ్డూ తయారీ విధానం

-ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల (వేరుశెనగ) పొట్టు తీసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి పాన్ పెట్టి ఓట్స్, జీడిపప్పు, నువ్వులను విడివిడిగా దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

-ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పొట్టు తీసిన పల్లీలు, వేయించిన ఓట్స్, జీడిపప్పు, నువ్వులు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పౌడర్‌ లా కాకుండా కాస్త పలుకులుగా ఉంటే లడ్డూలు తినేటప్పుడు పంటికి తగులుతూ రుచిగా ఉంటాయి.

-ఇప్పుడు ఈ పొడి మిశ్రమానికి కోకో పౌడర్ జత చేసి బాగా కలుపుకోవాలి.

-మళ్లీ స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేడి చేయాలి. అందులో గింజలు తీసిన ఖర్జూరాలను వేసి అవి సాఫ్ట్‌ గా అయ్యే వరకు సన్నని మంటపై ఉడికించాలి.

-ఖర్జూరాలు మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి, గరిటెతో వాటిని పేస్ట్‌ లా మాష్ (స్మాష్) చేసుకోవాలి.

-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీలు, ఓట్స్ పొడిలో ఈ వేడివేడి ఖర్జూరం పేస్ట్ వేసి గరిటెతో కలపాలి. కాస్త చల్లారాక చేత్తో బాగా మిక్స్ చేయాలి. చివరగా మంచి సువాసన కోసం కొద్దిగా యాలకుల పొడి చల్లి, మిశ్రమం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.

-ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతికి కాస్త నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోవాలి.

-అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన చాక్లెట్ ప్రోటీన్ లడ్డూలు రెడీ. వీటిని గాలి చొరబడని కంటైనర్‌ లో నిల్వ చేసుకుంటే 15 రోజుల వరకు ఏమాత్రం పాడవకుండా, ఫ్రెష్‌ గా ఉంటాయి.

పోషక విలువలు - ఆరోగ్య ప్రయోజనాలు

ఐరన్,కాల్షియం ఖజానా: ఇందులో వాడిన నువ్వులు, ఖర్జూరాల్లో ఐరన్, కాల్షియం మెండుగా ఉంటాయి. ఇవి రక్తహీనత రాకుండా అడ్డుకుంటాయి. ఎముకలు, దంతాలు ధృడంగా మారడానికి ఇవి ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలకు, ఎదుగుతున్న పిల్లలకు ఇది దివ్యౌషధం.

ప్రోటీన్ పవర్: పల్లీలు, ఓట్స్ వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి, కండరాల ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా అవసరం.

మెదడుకు మేలు చేసే కొవ్వులు: జీడిపప్పు, నెయ్యిలో ఉండే గుడ్ ఫ్యాట్స్ మెదడు చురుకుగా పనిచేయడానికి సహాయపడతాయి.

బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్: పంచదార, బెల్లం వాడకపోవడం వల్ల క్యాలరీలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునేవారు కూడా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు దీన్ని భయం లేకుండా తినొచ్చు. ఓట్స్, ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు: కోకో పౌడర్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, శరీరంలోని ఒత్తిడిని తగ్గించి మానసిక ఆనందాన్ని ఇస్తాయి.

[ of 5 - Users]
Story first published: Tuesday, June 30, 2026, 12:49 [IST]
Desktop Bottom Promotion