Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
తీపి.. ఈ పదం వింటేనే మనందరి నోళ్లలో నీళ్లు ఊరుతాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, దేవుడికి పూజ చేసినా లేదా అనుకోకుండా అతిథులు ఇంటికి వచ్చినా.. మనకు ముందుగా ఉత్సాహాన్నిచ్చేది స్వీట్లే. ఇక ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఎప్పుడూ ఏదో ఒక స్వీట్ కావాలని మారం చేస్తూనే ఉంటారు.
ఎక్కువ రోజులు నిల్వ ఉండే, ఎంతో రుచికరమైన, సులభంగా తయారు చేసుకోగలిగే ఒక అద్భుతమైన స్వీట్ కమ్మని కొబ్బరి బర్ఫీ. స్వచ్ఛమైన కొబ్బరితో ఇంట్లోనే అచ్చమైన బేకరీ రుచితో బర్ఫీని సులభంగా తయారు చేసుకోవచ్చు. కేవలం ఐదు పదార్థాలతో ఈ నోరూరించే బర్ఫీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కొబ్బరి బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు
కొబ్బరి తురుము (తెల్లటి భాగం మాత్రమే) - 1 కప్పు
చక్కెర - రుచికి తగినంత (సుమారు ముప్పావు కప్పు)
పాలు - పావు కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్
నెయ్యి - కొద్దిగా
కొబ్బరి బర్ఫీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ లేదా కడాయి
పెట్టుకోండి.
అందులో ముందుగా సిద్ధం చేసుకున్న తెల్లటి కొబ్బరి తురుమును వేయండి.
మార్కెట్లో దొరికే డెసికేటెడ్ కొకోనట్ పౌడర్ కూడా వాడవచ్చు.
-మంటను పూర్తిగా సిమ్ లో ఉంచి కొబ్బరిని కొద్దిసేపు వేయించండి.ఇప్పుడు అందులో మీరు తీసుకున్న కొబ్బరి తురుముకు తగినంత చక్కెర, పావు కప్పు పాలు పోసి గరిటెతో బాగా కలపండి.
-వేడికి చక్కెర నెమ్మదిగా కరుగుతూ పాకంలా మారుతుంది. ఈ మిశ్రమం కాస్త దగ్గరపడే వరకు ఆపకుండా కలుపుతూనే ఉండాలి.
-మిశ్రమం కొద్దిగా గట్టిపడుతున్న సమయంలో మంచి సువాసన కోసం యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
-ఈ మిశ్రమం అంతా ఒక ముద్దలా వచ్చేంత వరకు ఉంచాలి. దీనికి సుమారు రెండు నిమిషాల సమయం పడుతుంది. మీకు బర్ఫీ కొద్దిగా గట్టిగా కావాలంటే మరో నిమిషం పాటు వేయించుకోవచ్చు.ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని, దానికి కొద్దిగా నెయ్యి రాసి పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసి తయారైన కొబ్బరి మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకోండి. గరిటెతో సమానంగా అంతటా స్ప్రెడ్ చేసి, గట్టిగా నొక్కండి.
-ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చాకుతో మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోండి.
-అంతే ఎంతో రుచికరమైన కొబ్బరి బర్ఫీ రెడీ. ఈ స్వీట్‌ను గాలి చొరబడని ఒక స్టీల్ లేదా గాజు డబ్బాలో భద్రపరుచుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications