For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరి లడ్డూ తయారీ విధానంః గడ్డకడుతున్న పాలతో కొబ్బరి లడ్డూ

కొబ్బరి లడ్డూను అన్నిపండగల్లో సంప్రదాయపు భారత వంటకంగా వ్యవహరిస్తారు. ఇది కొబ్బరి కోరు, గట్టిపడుతున్న పాలతో తయారవుతుంది. స్టెప్ బై స్టెప్ విధానం, చిత్రాలు, వీడియో ఇదిగో, చేసేయండి.

Posted By: Deepthi
|

ప్రతి ఇంట్లో ముఖ్య ఉత్సవాలకు, అన్ని పండగలకూ చేసుకునే స్వీటు పదార్థం కొబ్బరి లడ్డూ. ఇది పొడి కొబ్బరికోరు, గట్టిపడే పాలతో తయారవుతుంది.కొబ్బరి, గట్టిపడుతున్న పాలతో ఉడికి ఈ లడ్డూ ప్రత్యేకమైన వాసనను సంతరించుకుంటుంది.

తింటున్నప్పుడు రసంతో కూడిన ఈ లడ్డూ తిరిగి తిరిగి తినాలనిపించేలా చేస్తుంది. ఈ నోరూరించే వంటకం సులువుగా, తొందరగా వండుకోవచ్చు. వంటరాని వారు కూడా ఎక్కువ శ్రమలేకుండానే దీన్ని బాగా తయారుచేసుకోవచ్చు. హఠాత్తుగా స్వీట్లు తినాలపించేవారికి ఇది మంచి ఉపాయం.

కొబ్బరి లడ్డూ తయారీ వీడియో

కొబ్బరిలడ్డూ తయారీ । కొబ్బరి లడ్డూ ఎలా తయారుచేయాలి । గట్టిపాలతో కొబ్బరి లడ్డూ తయారీ
కొబ్బరిలడ్డూ తయారీ । కొబ్బరి లడ్డూ ఎలా తయారుచేయాలి । గట్టిపాలతో కొబ్బరి లడ్డూ తయారీ
Prep Time
5 Mins
Cook Time
10M
Total Time
15 Mins

Recipe By: మీనా బంఢారి

Recipe Type: స్వీట్లు

Serves: 8-10 లడ్డూలు

Ingredients
  • పొడి కోరిన కొబ్బరి - 2 కప్పులు + 1 కప్పు పైన పూతకి

    తీపి గట్టిపడిన పాలు (మిల్క్ మెయిడ్ ) - 200 గ్రాములు

    తరిగిన బాదం - 2చెంచాలు+ అలంకరణకి

    ఏలకుల పొడి - 1 చెంచా

How to Prepare
  • 1. గట్టిపడిన పాలను వేడిచేసిన కడాయిలో పోసి వెనువెంటనే 2 కప్పుల కొబ్బరికోరును వేయండి.

    2. మిశ్రమం గట్టిపడి, అతుక్కుపోతున్నంతవరకు కలుపుతూనే ఉండండి.

    3. ఏలకుల పొడి, బాదం పప్పులు వేసి పిండి ముద్దలా మారుతున్నంతవరకూ కలపండి.

    4. ఈ మిశ్రమాన్ని గుండ్రటి బంతుల్లాగా చేసుకోండి.

    5. ఈ గుండ్రటి లడ్డూలను పొడి కొబ్బరిలో పొర్లించి పట్టించండి.

    6. బాదంపప్పులతో అలంకరించండి.

Instructions
  • 1. ఈ లడ్డూలను పచ్చి కొబ్బరికోరుతో కూడా చేసుకోవచ్చు. తాజా కొబ్బరిని వాడితే మొదట తేమను తొలగించటానికి పొడిగా వేయించుకోండి.
  • 2. మిశ్రమాన్ని కలుపుతున్నప్పుడు, పిండిముద్దలా మారిన మిశ్రమం అతుక్కోకుండా కడాయి నుంచి ఊడిరావాలని గుర్తుంచుకోండి.
  • 3. మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలుగా చేయాలి.
Nutritional Information
  • సరిపోయే పరిమాణం - 1 లడ్డూ
  • క్యాలరీలు - 54
  • కొవ్వు - 2 గ్రాములు
  • ప్రొటీన్ - 1 గ్రాము
  • కార్బొహైడ్రేట్లు - 9 గ్రాములు
  • చక్కెర - 9 గ్రాములు

స్టెప్ బై స్టెప్ - కొబ్బరి లడ్డూలు చేయటం ఎలా

1. గట్టిపడిన పాలను వేడిచేసిన కడాయిలో పోసి వెనువెంటనే 2 కప్పుల కొబ్బరికోరును వేయండి.

2. మిశ్రమం గట్టిపడి, అతుక్కుపోతున్నంతవరకు కలుపుతూనే ఉండండి.

3. ఏలకుల పొడి, బాదం పప్పులు వేసి పిండి ముద్దలా మారుతున్నంతవరకూ కలపండి.

4. ఈ మిశ్రమాన్ని గుండ్రటి బంతుల్లాగా చేసుకోండి.

5. ఈ గుండ్రటి లడ్డూలను పొడి కొబ్బరిలో పొర్లించి పట్టించండి.

6. బాదంపప్పులతో అలంకరించండి.

[ 4 of 5 - 33 Users]
English summary

కొబ్బరి లడ్డూ రెసిపి । కొబ్బరి లడ్డూ చేయటం ఎలా । థెంగై లడ్డూను గడ్డకడుతున్న పాలతో వండటం ఎలా

The coconut ladoo is an authentic sweet prepared for many festivals and is made from dry grated coconut, condensed milk and almonds.
Desktop Bottom Promotion