Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
చపాతీ, పుల్కాలోకి అదిరిపోయే కాంబినేషన్..పంజాబీ దాబా స్టైల్ చన్నా మసాలా..ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
మీ ఇంట్లో రాత్రి పూట చపాతీలు లేదా పుల్కాలు చేయడం అలవాటేనా? వాటిలోకి మీరు ఎప్పుడూ ఒకే రకమైన చన్నా మసాలా (శనగలు) కూరను వండుతున్నారా? అయితే మీకు ఆ రుచి బోర్ కొట్టే ఉంటుంది.
ఈసారి ఆ రొటీన్ రుచికి బ్రేక్ ఇచ్చి, పంజాబీ దాబాలో దొరికే ఘుమఘుమలాడే చన్నా మసాలాను మీ ఇంట్లోనే తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఈ అద్భుతమైన రెసిపీని ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కాబూలీ శనగలు - 1 కప్పు
బిర్యానీ ఆకు - 1
నల్ల యాలకులు - 3
బంగాళాదుంప - 1
నీళ్లు - తగినన్ని
పచ్చిమిర్చి - 2
వెల్లుల్లి - 5 రెబ్బలు
అల్లం - 2 అంగుళాల ముక్క
గట్టి పెరుగు - 3 టేబుల్ స్పూన్లు
నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 స్పూన్
ఉల్లిపాయ - 1
పసుపు - చిటికెడు
కారం - 1 స్పూన్
ధనియాల పొడి - 1 స్పూన్
చన్నా మసాలా పౌడర్ - ఒకటిన్నర స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - ఒకటిన్నర టీస్పూన్లు
ఎండు మిరపకాయ - 1
అల్లం ముక్కలు - 1 అంగుళం
కసూరి మేతి - 1 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
కశ్మీరీ కారం - రంగు కోసం కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా కుక్కర్ లో రాత్రంతా నానబెట్టిన శనగలు, బిర్యానీ ఆకు, నల్ల యాలకులు, ఒక బంగాళాదుంప వేసి మునిగేంత వరకు నీళ్లు పోయాలి. మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మసాలా దినుసులు (ఆకు, యాలకులు) తీసేయండి. బంగాళాదుంప పొట్టు తీసి రెండు ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పెరుగు వేయాలి. ఇందులోనే ఉడికించిన బంగాళాదుంపలో సగం ముక్కను, ఒక గుప్పెడు ఉడికించిన శనగలను వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెలో నూనె వేడి చేసి జీలకర్ర వేయండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, చన్నా మసాలా పొడి వేసి సన్నని మంటపై వేగనివ్వాలి.
-ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి. తర్వాత ఉడికించిన శనగలను నీళ్లతో సహా వేసి కలపాలి. మిగిలిన సగం బంగాళాదుంపను చిన్న ముక్కలుగా చేసి వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి 10-12 నిమిషాల పాటు ఉడికించాలి.
-కూర దించే ముందు చిన్న పాన్ పెట్టి నెయ్యి వేడి చేయాలి. అందులో ఎండుమిర్చి, పొడవుగా కోసిన అల్లం ముక్కలు, కసూరి మేతి, ఇంగువ, కొద్దిగా కశ్మీరీ కారం వేసి వేయించి, వెంటనే ఆ పోపును మరుగుతున్న కూరలో వేసి కొత్తిమీర చల్లుకోవాలి.
-అంతే పంజాబీ దాబా స్టైల్ చన్నా మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications