Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా
కూరగాయల్లో సొరకాయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది, కాబట్టి ఇది మన శరీరాన్ని ఎల్లప్పుడూ చల్లగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి, జీర్ణక్రియ మెరుగుపడాలనుకునే వారికి ఇదొక దివ్యౌషధం. కానీ దురదృష్టవశాత్తూ చాలా మంది సొరకాయ పేరు వినగానే ముఖం చిట్లిస్తారు. ఇంట్లో సొరకాయ వండారంటే చాలు, ఎవరూ తినడానికి ఆసక్తి చూపించరు.

కానీ సొరకాయ పెరుగు తాలింపు ఇంట్లో చేస్తే మాత్రం ఇంకా ఇంకా అని అడగడం గ్యారెంటీ. ఇందులో ఉన్న అద్భుతమైన విషయం ఏమిటంటే.. దీనిని చూసి గానీ, రుచి చూసి గానీ ఇందులో సొరకాయ ఉందని ఎవరూ అస్సలు ఊహించలేరు. సొరకాయ దహీ తడ్కా(సొరకాయ పెరుగు తాలింపు)ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
సొరకాయ దహీ తడ్కా తయారీకి కావలసిన పదార్థాలు
సొరకాయ తురుము - అర కప్పు
పెరుగు - అర కప్పు
ఆవ నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు- అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
సోంపు - పావు టీస్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
పచ్చిమిర్చి - 2
వెల్లుల్లి రెబ్బలు - 3-4
ఉల్లిపాయ - 1
కారం-తగినంత
పసుపు-తగినంత
ఉప్పు-తగినంత
కొత్తిమీర - కొద్దిగా
సొరకాయ దహీ తడ్కా తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సోంపు వేసి చిటపటలాడే వరకు వేయించండి. సోంపు వేయడం వల్ల ఈ వంటకానికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది.
-ఇప్పుడు అందులో కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసి దోరగా వేయించండి. అవి వేగిన తర్వాత, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా మగ్గనివ్వండి. ఆ తర్వాత, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న సొరకాయ తురుమును వేసి బాగా కలపండి. సుమారు 4 నుండి 5 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించండి. సొరకాయను మరీ మెత్తగా ఉడికించకూడదు.
-సొరకాయ ఉడికిన తర్వాత అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, ఉప్పు వేసి మసాలాలన్నీ పట్టేలా మరో నిమిషం పాటు బాగా వేయించండి.
-ఇప్పుడు అందులో పెరుగు కలపాలి. వేడిగా ఉన్నప్పుడు పెరుగు పోస్తే విరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, స్టవ్ ఆపేసి బాండీని కొద్దిగా చల్లారనివ్వండి. వేడి తగ్గాక, ముందుగానే గడ్డలు లేకుండా బాగా చిలికి పెట్టుకున్న పెరుగును అందులో పోసి, అన్నీ కలిసేలా నిరంతరం కలపాలి.
-చివరగా, సన్నగా తరిగిన తాజా కొత్తిమీరను పైన చల్లుకుంటే, ఎంతో కమ్మనైన, నోరూరించే సొరకాయ దహీ తడ్కా రెడీ. దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తిన్నా లేదా చపాతీ, రోటీ, పరాఠాలతో నంజుకుని తిన్నా దీని రుచి అమోఘంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications