Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
అన్నంలోకి అమృతంలా ఉండే పెరుగు వంకాయ గ్రేవీ.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ!
వేసవి కాలంలో మన శరీరాన్ని చల్లబరిచి, ఆరోగ్యానికి మేలు చేసే ఉత్తమమైన ఆహారం పెరుగు. పెరుగును ఆహారంలో ఎక్కువగా భాగం చేసుకుంటే ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించడంతో పాటు పొట్టకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అయితే ప్రతిరోజూ కేవలం పెరుగన్నం మాత్రమే తింటే బోర్ కొడుతుంది.
పెరుగుతోనే నోటికి రుచిగా ఉండే అద్భుతమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. అలాంటి ఒక కమ్మటి, నోరూరించే వంటకమే పెరుగు వంకాయ గ్రేవీ. ఈ కూర అన్నంలో కలుపుకుని తింటే అమృతంలా ఉంటుంది.

పెరుగు వంకాయ గ్రేవీ తయారీకి కావలసిన పదార్థాలు
పెద్ద వంకాయలు - 2
పసుపు - 1 టీస్పూన్
కశ్మీరీ కారం పొడి - 3 టీస్పూన్లు
ఉప్పు - ఒకటిన్నర టీస్పూన్లు
నూనె - 1 టీస్పూన్
చిక్కటి పెరుగు - 400 గ్రాములు
నూనె - 3 టీస్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 2
ఇంగువ- చిటికెడు
ఉల్లిపాయ - 1
కారం - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
పెరుగు వంకాయ గ్రేవీ తయారీ విధానం
-ముందుగా పెద్ద వంకాయలను తీసుకుని శుభ్రంగా కడగాలి. వాటిని మరీ పల్చగా కాకుండా, కొంచెం మందంగా ఉండేలా గుండ్రటి ముక్కలుగా కోసుకోవాలి.
-ఒక గిన్నెలో వంకాయ ముక్కలను వేసి, అందులో పసుపు, కశ్మీరీ కారం, ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి ముక్కలన్నింటికీ మసాలా బాగా పట్టేలా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలిపిన ముక్కలపై మూత పెట్టి సుమారు 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
-400 గ్రాముల చిక్కటి పెరుగును తీసుకుని, అందులో ఉండలు లేకుండా స్పూన్ తో లేదా విస్కర్ తో బాగా గిలకొట్టి పక్కన ఉంచుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ లేదా తవా పెట్టుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక మసాలా పట్టించిన వంకాయ ముక్కలను పాన్ లో వేయాలి. రెండు వైపులా తిప్పుతూ, వంకాయ ముక్కలు దోరగా వేగి, మెత్తబడే వరకు కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి.
-అదే స్టవ్ మీద మరో కడాయి పెట్టి మూడు టీస్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, ఎండు మిరపకాయలు, ఇంగువ చిటికెడు వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి మెత్తబడే వరకు దోరగా వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కారం, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు చల్లి, మసాలాల పచ్చి వాసన పోయేలా మీడియం మంట మీద వేయించి స్టవ్ ఆపేయాలి.
-ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ లోవేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలలో కొన్నింటిని అడుగున పేర్చాలి. వాటిపైన మనం గిలకొట్టి పెట్టుకున్న చిక్కటి పెరుగును సమానంగా పోయాలి. ఆ పెరుగు పైన తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా పోపును వేసి మెల్లగా కలపాలి. చివరగా మిగిలిన వేయించిన వంకాయ ముక్కలను పైన అలంకరించుకోవాలి.
-అంతే పెరుగు వంకాయ గ్రేవీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
