For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తిమీర పచ్చడి తయారీ విధానం ; ఇంట్లో తయారుచేసుకునే గ్రీన్ చట్నీ!

కొత్తిమీర చట్నీ పద్ధతి లేదా ఆకుపచ్చని పచ్చడి విరివిగా అన్నిచోట్లా, ముఖ్యంగా ఛాట్లలో లేదా ఇతర చిరుతిళ్ళలో నంచుకోడానికి వాడతారు. పుల్లగా, ఘాటుగా ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడి, మన ఆహరానికి రంగులు అద్దుతుంది.

Posted By: DEEPTHI T A S
|

కొత్తిమీర చట్నీ పద్ధతి లేదా ఆకుపచ్చని పచ్చడి విరివిగా అన్నిచోట్లా, ముఖ్యంగా ఛాట్లలో లేదా ఇతర చిరుతిళ్ళలో నంచుకోడానికి వాడతారు. పుల్లగా, ఘాటుగా ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడి, మన ఆహరానికి రంగులు అద్దుతుంది. ఈ పచ్చ చట్నీ పక్కనలేకుంటే ఛాట్ ఎప్పుడూ అసంపూర్ణమే. శాండ్ విచ్ లలో కూడా పైన పూయడానికి వాడతారు.

ఈ ఇంట్లో తయారయ్యే పచ్చడిని గాలి చొరబడని డబ్బాలలో ఒకవారానికి పైగా దాచుకోవచ్చు. ఇది ఇంట్లో తయారుచేసుకోవడం ఎంతో తేలిక. మీకోసం పాయింట్లవారిగా ఎలా తయారుచెయ్యాలో కింద ఇచ్చాం. చదివి, వీడియోను కూడా చూసి ఎలా తయారుచెయ్యాలో తెలుసుకోండి.

కొత్తిమీర పచ్చడి తయారీ । ఆకుపచ్చని చట్నీ తయారీ । ఛాట్ కోసం గ్రీన్ పచ్చడి । కొత్తిమీర ఇంటిపచ్చడి తయారీ
కొత్తిమీర పచ్చడి తయారీ । ఆకుపచ్చని చట్నీ తయారీ । ఛాట్ కోసం గ్రీన్ పచ్చడి । కొత్తిమీర ఇంటిపచ్చడి తయారీ
Prep Time
10 Mins
Cook Time
5M
Total Time
15 Mins

Recipe By: రీతా త్యాగి

Recipe Type: పచ్చళ్ళు

Serves: ఒక డబ్బాలో

Ingredients
  • కొత్తిమీర (బాగా తరిగినది) - ఒక పెద్ద గిన్నెలో

    పచ్చిమామిడి (చెక్కు తీసినది మరియు ముక్కలుగా తరిగినది ) - 1 చిన్నది

    ఉల్లిపాయలు ( పైన పొరలు తీసి, ముక్కలు చేసినది )- ఒక మధ్య సైజుది

    పచ్చిమిరపకాయలు- 8-10 చిన్నవి

    అల్లం (చెక్కు తీసినది)- 2 అంగుళాల ముక్క

    ఉప్పు- 2 చెంచాలు

    పంచదార- 2 చెంచాలు

    నిమ్మరసం-2-3 చెంచాలు

How to Prepare
  • 1.అన్ని వస్తువులను మిక్సీ జార్ లో వేయండి.

    2.మెత్తగా అయ్యే వరకు మిక్సీ తిప్పండి.

Instructions
  • 1.కొత్తిమీర ఆకులను బాగా కడిగి తరగండి. దానిద్వారా పచ్చడిలో ఏ ఇసుక లేదా రాళ్ళు రాకుండా ఉంటాయి.
  • 2.చట్నీ ఇంకా పల్చగా కావాలనుకుంటే 2-3 చెంచాల నీరును వేయండి.
  • 3.మరింత రుచికోసం పుదీనా ఆకులను వేయవచ్చు.
  • 4.గాలిచొరబడని డబ్బాలో పోసి, ఫ్రిజ్ లో పెట్టండి.
Nutritional Information
  • వడ్డించే పరిమాణం - 1చెంచాకి
  • క్యాలరీలు - 4
  • కొవ్వు- - 0.1 గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 0.7 గ్రాములు
  • ఫైబర్ - 0.4 గ్రాములు

ఎలా తయారుచెయ్యాలి

1.అన్ని వస్తువులను మిక్సీ జార్ లో వేయండి.

2.మెత్తగా అయ్యే వరకు మిక్సీ తిప్పండి.

[ 5 of 5 - 102 Users]
English summary

Coriander Chutney Recipe | Green Chutney Recipe | Green Chutney For Chaat | Homemade Coriander Chutney Recipe

Coriander Chutney Recipe - Images, video & step by step procedure. Here is a step by step procedure to make this delicious and extremely easy Coriander Chutney at home. It is easy to make this and takes only about 10-15 minutes.
Story first published: Thursday, January 25, 2018, 12:19 [IST]
Desktop Bottom Promotion