Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
2 గుడ్లు ఉండే చాలు..ఇంటిల్లిపాదికి సరిపోయే ఆమ్లెట్ పకోడీ..మీరు ఎప్పుడూ తినని స్పెషల్ టేస్ట్..ఎలా చేసుకోవాలంటే
మీరెప్పుడైనా ఆమ్లెట్ పకోడీ తిన్నారా? పేరు విచిత్రంగా ఉన్నా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఆమ్లెట్, పకోడిల రుచుల కలయికతో ఈ వంటకాన్ని తయారు చేస్తారు. ఆమ్లెట్ లోని సున్నితమైన రుచి, పకోడి పిండిలోని కరకరలాడే స్వభావం కలగలిసి ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. ఈ వంటకాన్ని సాయంత్రం వేళ టీ లేదా కాఫీతో కలిపి తీసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. మనసు ఆహ్లాదంగా ఉండేలా, ఆహారం పట్ల ఆనందాన్ని పెంచడంలో ఇవి సహాయపడతాయి. సులభంగా తయారు చేయగల ఆమ్లెట్ పకోడిని ఏ సమయంలో అయినా తినొచ్చు. ముఖ్యంగా పండుగలు, వేడుకల్లో స్టార్టర్ గా ఉపయోగించవచ్చు. ఈ రెసిపీని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఆమ్లెట్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-కొడిగుడ్లు
-పచ్చిమిరపకాయ
-పసుపు
-కారం
-ఉప్పు
-ఆయిల్
-గరం మసాలా
-ఉల్లిపాయ
-కొత్తిమీర
-శెనగపిండి

ఆమ్లెట్ పకోడీ తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ తీసుకోంని అందులో రెండు కోడిగుడ్లను పగులకొట్టి వేసుకోండి.
-పగులకొట్టుకున్న గుడ్ల మిశ్రమంలోనే 2 స్పూన్ల శెనగపిండి, సన్నగా కట్ చేసిన 1 పచ్చిమిరపకాయ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
-శెనగపిండి వేయడం వల్ల కలిపేటప్పుడు ఉండలు కడుతూ ఉంటాయి. కాబట్టి చూసుకొని మంచిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
-బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసి వేడి చెయ్యండి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని చిన్న గరిటతో తీసుకొని బాండీకి సరిపడా ఆమ్లెట్స్ ను చిన్న చిన్నగా వేసుకోవాలి.
-వాటిని రెండు సైడ్లు తిప్పుకుంటూ తక్కువ మంటమీద మంచిగా వేయించుకొని తర్వాత తీసి బౌల్ లో పెట్టుకోండి.
-ఇలా పిండిమొత్తాన్ని చేసుకున్న తర్వాత బౌల్ లోని ఆమ్లెట్ పకోడీ మీద కొంచెం గరం మసాలా చల్లుకొని మంచిగా మిక్స్ చేయండి. అంతే సింపుల్ అండ్ టేస్టీ ఆమ్లెట్ పకోడీ రెడీ.
ప్రయోజనాలు
ఆమ్లెట్ పకోడిలోని ప్రధాన పదార్థం గుడ్డు. గుడ్లు అధిక ప్రొటీన్లకు
మంచి మూలం. ప్రొటీన్లు మన శరీరంలో కండరాల నిర్మాణం, కణాల మరమ్మత్తు,
రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఒక గుడ్డులో
దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఈ పకోడిని తినడం వల్ల శరీరానికి
అవసరమైన ప్రొటీన్లు లభిస్తాయి. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకు,
క్రీడాకారులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆమ్లెట్ పకోడిని తయారు
చేయడానికి గుడ్లు, శనగపిండి, నూనెలను ఉపయోగిస్తారు. ఇవన్నీ
శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను
అందిస్తాయి. మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఆకలిగా ఉన్నప్పుడు ఈ
పకోడిని తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇది అల్పాహారం
లేదా స్నాక్ ఐటెమ్ కాబట్టి దీన్ని భోజనంగా కాకుండా అప్పుడప్పుడు
స్నాక్ లాగా తినడం మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications