Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఊటీ స్పెషల్ గ్రీన్ చిల్లీ చికెన్..చల్లని వాతావరణానికి వేడి వేడి కిక్
బయట వాతావరణం చల్లగా ఉన్నా మనసు ఏదో ఒక స్పైసీ మాంసాహారాన్ని కోరుకోవడం సహజం. సాధారణంగా ఆదివారాలు లేదా సెలవు దినాల్లో చికెన్, మటన్ తెచ్చుకుని ఎప్పుడూ చేసే విధంగా ఎర్ర కారం వేసి వండుతుంటాం. కానీ ఈసారి ఆ రొటీన్ రుచికి బ్రేక్ చెప్పండి.
ఊటీ స్పెషల్ గ్రీన్ చిల్లీ చికెన్ మీ ఇంట్లోనే ట్రై చేయండి. ఒక్కసారి రుచి చూస్తే, మళ్ళీ మళ్ళీ వండుకుంటారు. ఊటీ స్పెషల్ గ్రీన్ చిల్లీ చికెన్ ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

తయారీకి కావలసిన పదార్థాలు
చికెన్: ముప్పావు కిలో
నెయ్యి: 100 మి.లీ
వెల్లుల్లి: 150 గ్రాములు
పచ్చిమిర్చి: 150 గ్రాములు
సోయా సాస్: అర టేబుల్ స్పూన్
నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్
మొక్కజొన్న పిండి: అర టేబుల్ స్పూన్
పసుపు: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నీరు: తగినంత
తయారీ విధానం
-ముందుగా మిక్సీ గిన్నెలో 150 గ్రాముల పచ్చిమిర్చిని వేసి మరీ మెత్తగా కాకుండా, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో అదే జార్ లో వెల్లుల్లి రెబ్బలను వేసి వాటిని కూడా పేస్ట్ లా చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాన్ పెట్టండి. అందులో 100 మి.లీ నెయ్యి వేసి వేడెక్కనివ్వండి. నెయ్యి కరిగాక సిద్ధం చేసుకున్న వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. మంటను మీడియంలో ఉంచి పచ్చి వాసన పోయేంత వరకు సుమారు 5 నిమిషాల పాటు బాగా వేయించాలి.
-తర్వాత మరో 6 పచ్చిమిరపకాయలను నిలువుగా చీల్చి వేయండి. ఆ వెంటనే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను పాన్ లో వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి, మసాలా ముక్కలకు పట్టేలా బాగా కలపాలి.
-కాసేపటికి చికెన్ నుండి నీరు రావడం మొదలవుతుంది. అప్పుడు పసుపు వేసి, చికెన్ ఉడకడానికి అవసరమైన కొద్దిపాటి నీటిని పోసి ఒకసారి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం మంటపై ఒక 10 నిమిషాల పాటు చికెన్‌ను మెత్తగా ఉడకనివ్వండి.
-చికెన్ దాదాపుగా ఉడికిన తర్వాత మూత తీసి సోయా సాస్, నిమ్మరసం వేసి కలపండి. ఇది కూరకు మంచి రంగును మరియు రుచిని ఇస్తుంది. చివరగా, అర టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండిని కొద్దిగా నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని కూరలో పోయాలి. దీనివల్ల గ్రేవీ చిక్కబడి, ముక్కలకు బాగా పట్టుకుంటుంది.
-మొక్కజొన్న పిండి వేసాక ఒక 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే వేడి వేడి, ఘాటైన ఊటీ స్పెషల్ గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ.
-దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తిన్నా, లేదా చపాతీ, పుల్కా, నాన్ లతో తిన్నా అద్భుతంగా ఉంటుంది. స్టార్టర్ గా కూడా ఇది అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications