Latest Updates
-
Beer vs Whisky: బీర్ సేఫా? విస్కీ బెటరా? మందుబాబులు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
మంత్రాల చివర్లో వచ్చే.. స్వాహా, నమః వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! -
కరీనా కపూర్ ఫేవరెట్ సూప్ ఇదే..బెలెడు ప్రయోజనాలు..ఎలా చేసుకోవాలంటే.. -
కామసూత్ర రహస్యాలు..శృంగారంలో మీ భాగస్వామికి స్వర్గసుఖాలు పరిచయం చేయండిలా! -
ఫైబర్, ప్రోటీన్ ఫుల్.. బార్లీ దోశ తింటే బాడీ సెట్! -
మొటిమలు, చుండ్రుకు శాశ్వత పరిష్కారం: వన తులసితో మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం! -
వర్షాకాలం చలిలో వేడివేడిగా చికెన్ కీమా పరాఠా..అబ్బా ఆ రుచే వేరప్పా..చేసుకోండిలా.. -
జులై చివరి వారం.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే.! -
చెట్టినాడ్ శనగ కుర్మా..చపాతీతో తింటుంటే కిక్కే కిక్కు! -
రక్తహీనతకు చెక్,చర్మానికి గ్లో..పోషకాల గని బీట్ రూట్ తో కమ్మని హల్వా చేసుకోండిలా..
చైనీస్ రుచి, ఇండియన్ ఘాటు..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చిల్లీ పనీర్ చేసుకోండిలా..
చైనీస్ వంటకాల రుచి, మన ఇండియన్ స్పైసెస్ ఘాటు..ఈ రెండూ కలిస్తే పుట్టే అద్భుతమైన రుచే చిల్లీ పనీర్. ఇది కేవలం ఒక వంటకం కాదు, భోజన ప్రియుల మనసు దోచే ఒక మ్యాజిక్ అని చెప్పవచ్చు. బయట వర్షం పడుతున్నప్పుడు లేదా వీకెండ్స్ లో స్పెషల్ గా ఏదైనా తినాలనిపించినప్పుడు ముందుగా గుర్తొచ్చే రెసిపీ ఇదే. చిల్లీ పనీర్ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

చిల్లీ పనీర్ తయారీకి కావలసిన పదార్థాలు
పనీర్: 250 గ్రాములు
మైదా పిండి: 3 టేబుల్ స్పూన్లు
కార్న్‌ఫ్లోర్ (మొక్కజొన్న పిండి): 2 టేబుల్ స్పూన్లు
నల్ల మిరియాల పొడి: అర టీస్పూన్
కారం పొడి: అర టీస్పూన్
ఉప్పు: రుచికి తగినంత
నూనె: 4 టేబుల్ స్పూన్లు
గ్రేవీ,సాస్ తయారీ కోసం
ఉల్లిపాయ: 1
క్యాప్సికమ్: 1
పచ్చి మిరపకాయలు: 2
వెల్లుల్లి: 1 టేబుల్ స్పూన్
అల్లం: 1 టేబుల్ స్పూన్
సోయా సాస్: 1 టేబుల్ స్పూన్
రెడ్ చిల్లీ సాస్: 1 టేబుల్ స్పూన్
టొమాటో కెచప్: 1 టేబుల్ స్పూన్
వెనిగర్: 1 టీస్పూన్
చక్కెర: అర టీస్పూన్
స్ప్రింగ్ ఆనియన్స్: 2 టేబుల్ స్పూన్లు
కార్న్ ఫ్లోర్ మిశ్రమం
నీళ్లు: పావు కప్పు
చిల్లీ పనీర్ తయారీ విధానం
-ముందుగా ఒక టీస్పూన్ కార్న్ ఫ్లోర్ లో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని, అందులో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, కారం పొడి వేసి కలపాలి. ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మరీ పలచగా కాకుండా, కొంచెం చిక్కటి పేస్ట్ లా కలుపుకోవాలి. ఇప్పుడు పనీర్ ముక్కలను ఈ మిశ్రమంలో వేసి, ప్రతి ముక్కకు పిండి బాగా పట్టేలా సున్నితంగా కలపాలి.
-స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి, నూనె వేడి చేయండి. నూనె కాగాక, పిండిలో కలిపి పెట్టుకున్న పనీర్ ముక్కలను వేస్తూ మీడియం మంట మీద వేయించాలి. పనీర్ ముక్కలు అన్ని వైపులా మంచి బంగారు రంగులోకి మారి, పైన కరకరలాడేంత వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-అదే పాన్ లో మిగిలిన నూనెలో సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసి మంచి సువాసన వచ్చేలా వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు వేసి పెద్ద మంట మీద వేయించండి. చైనీస్ వంటకాల్లో కూరగాయలు పూర్తిగా ఉడకకూడదు, వాటిలోని క్రంచీనెస్ అలాగే ఉండాలి. కాబట్టి సగం ఉడికితే సరిపోతుంది.
-ఇప్పుడు మంట తగ్గించి సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో కెచప్, వెనిగర్, కొద్దిగా చక్కెర వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. పావు కప్పు నీళ్లు పోసి మరిగాక, ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని ఈ సాస్ లో పోసి కలపాలి. క్షణాల్లో గ్రేవీ నిగనిగలాడుతూ చిక్కగా మారుతుంది.
-చివరిగా వేయించి పెట్టుకున్న కరకరలాడే పనీర్ ముక్కలను, సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ ను ఈ గ్రేవీలో వేయాలి. సాస్ అంతా పనీర్ ముక్కలకు సమానంగా పట్టేలా సున్నితంగా టాస్ చేయండి.
-అంతే వేడివేడిగా ఘుమఘుమలాడే చిల్లీ పనీర్ రెడీ. దీనిని ఫ్రైడ్ రైస్, నూడుల్స్ లేదా రోటీల్లోకి సైడ్ డిష్ గా తీసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications