Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
పంజాబీ స్టైల్ బటర్ చికెన్..ఇంట్లోనే రెస్టారెంట్ రుచి..ఎలా చేసుకోవాలంటే
బటర్ చికెన్ ఈ పేరు వినగానే నోరూరని వారుండరు. చాలామంది నాన్ వెజ్ ప్రియులకు ఫేవరెట్ వంటకం ఇది. ఓ సందర్భంలో మనందరి ఫేవరెట్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ బటన్ చికెన్ ఉంటే చాలు తనకు ఇంకేదీ అక్కర్లేదు అన్నట్లుగా చెప్పారు. రెస్టారెంట్ కు వెళ్లిన ప్రతిసారీ తప్పక ఆర్డర్ చేసే ఈ వంటకాన్ని ఇంట్లోనే, అదే రుచితో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పంజాబీ వంటకాలకే తలమానికమైన ఈ బటర్ చికెన్ ను సులభంగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
చికెన్ మ్యారినేషన్ కోసం
-బోన్ లెస్ చికెన్ - అర కేజీ
-గట్టి పెరుగు - అర కప్పు
-అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
-కారం - 1 టీస్పూన్
-పసుపు - పావు టీస్పూన్
-గరం మసాలా - అర టీస్పూన్
-ఉప్పు - రుచికి సరిపడా
-నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
-నూనె - 2 టీస్పూన్లు
మఖమల్ లాంటి గ్రేవీ కోసం:
-వెన్న - 3 టేబుల్ స్పూన్లు
-పండిన టమోటాలు - 4
-జీడిపప్పు - 15
-అల్లం - చిన్న ముక్క
-వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
-పచ్చిమిర్చి - 2
-కాశ్మీరీ కారం - 1 టేబుల్ స్పూన్
-కసూరి మేథి - 1 టేబుల్ స్పూన్
-ఉప్పు - రుచికి సరిపడా
-తాజా క్రీమ్ - 3 టేబుల్ స్పూన్లు
-తేనె లేదా చక్కెర - 1 టీస్పూన్
-గరం మసాలా - అర టీస్పూన్

తయారీ విధానం
-ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలో మ్యారినేషన్ కోసం ఇచ్చిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ప్రతి ముక్కకు మసాలా పట్టేలా చూసి, కనీసం రెండు గంటలు లేదా రాత్రంతా ఫ్రిజ్‌లో నానబెట్టాలి.
-తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి నానబెట్టిన చికెన్ ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు మీడియం మంటపై వేయించాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.
-ఒక గిన్నెలో టమోటాలు, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి, కొద్దిగా నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు పాన్ లో వెన్న వేడి చేసి ఇందులో గ్రైండ్ చేసిన టమోటా పేస్ట్ వేయాలి. కాశ్మీరీ కారం, ఉప్పు, తేనె, గరం మసాలా వేసి బాగా కలపాలి. మిశ్రమం నుండి వెన్న పైకి తేలే వరకు చిన్న మంటపై 10 నిమిషాలు ఉడికించాలి.
-ఇప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను గ్రేవీలో వేసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా ఫ్రెష్ క్రీమ్, చేతులతో నలిపిన కసూరి మేథి వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికిస్తే చాలు. అంతే ఘుమఘుమలాడే వేడివేడి పంజాబీ బటర్ చికెన్ రెడీ.. దీనిని నాన్, రోటీ లేదా రైస్ తో వడ్డించి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications