Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.!
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
అన్నం, చపాతీ, పూరీ, పరాఠా, రోటీ లేదా బగారా రైస్,పులావ్.. ఇలా ఎందులోకైనా అద్భుతంగా సరిపోయే రుచికరమైన వంటకం క్యాప్సికం టమాటో మసాలా కర్రీ. పల్లీలు, నువ్వులతో చేసే ఈ మసాలా గ్రేవీ కూరకు కమ్మని రుచిని ఇస్తుంది. ఇంట్లో ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు లేదా వీకెండ్స్ లో ఏదైనా స్పెషల్ గా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు.

క్యాప్సికం టమాటో మసాలా కర్రీ తయారీకి కావాల్సినవి
-టమాటోలు
-క్యాప్సికం
-కొత్తిమీర
-కరివేపాకు
-కారం
-ఉప్పు
-పసుపు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-గరం మసాలా
-ధనియాల పొడి
-ఆయిల్
-మెంతులు
-జీలకర్ర
-లవంగాలు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-పల్లీలు
-నువ్వులు
-ఎండుకొబ్బరి లేదా పచ్చి కొబ్బరి
-చింతపండు రసం

క్యాప్సికం టమాటో మసాలా కర్రీ తయారీ విధానం
-ముందుగా ఉసిరికాయంత సైజులో చింతపండుని ఒక గిన్నెలో వేసి అందులో నీళ్లు పోసి నానబెట్టుకోండి.
-పావు కేజీ క్యాప్సికం(పెద్దవి అయితే 2, మీడియంవి అయితే 3)తీసుకొని శుభ్రంగా కడిగాక మరీ చిన్నగా కాకుండా,అలాగని మరీ పెద్దగా కాకుండా మీడియం సైజు ఉండేలా ముక్కలను కట్ చేసుకోండి.
-తర్వాత 3 టమాటోలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
-తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
-తర్వాత 4 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి తక్కువ మంట మీద 1 నిమిషం పాటు వేయించుకున్నాక అందులో 3 అంగుళాల పచ్చి లేదా ఎండు కొబ్బరి ముక్కలు వేసి కొంచెం వేయించాక అందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వేయించాలి.నువ్వులు వెంటనే చిటపటలాడుతాయి..ఇప్పుడు స్టవ్ ఆపేయండి. వేయించినవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ ని స్టవ్ మీద పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో 10 మెంతులు, అర టీస్పూన్ జీలకర్ర, 2 లవంగాలు వేసి వేగాక అందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి తక్కువ మంట మీద వేయించాలి. కొంచెం ఉప్పు చల్లుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి.
-ఉల్లిపాయ ముక్కలు మరీ ఫ్రై అవ్వనక్కర్లేదు..కాస్త మెత్తబడి, రంగు మారిన తర్వాత అందులో అర టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాక అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి.
-ఇప్పుడు అందులో కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకొని కలుపుకొని మూతపెట్టి 1 నిమిషం వదిలేయండి. తర్వాత మూత తీస్తే క్యాప్సికం ముక్కలు కొంచెం మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు అందులో టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఉప్పు వేసి కలిపి మూతపెట్టి తక్కువ మంట మీద మగ్గించుకోవాలి.
-అవి వేగేలోగా..ముందుగా వేయించిన పల్లీలు, కొబ్బరి,నువ్వుల మిశ్రమంని మిక్సీ గిన్నెలో వేసి నీళ్లు పోయకుండానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-క్యాప్సికం,టమాటో ముక్కలు మగ్గిన తర్వాత అందులో 1 టీస్పూన్ కారం వేసి కలిపాక మూతపెట్టి 4 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి.
-క్యాప్సికం,టమాటో ముక్కలు బాగా మెత్తబడి ఆయిల్ పైకి తేలుతున్న సమయంలో అందులో నానబెట్టిన చింతపండు నుంచి తీసిన రసాన్ని వేసుకొని కలుపుకున్నా అందులోనే ముందుగా గ్రైండ్ చేసిన నువ్వులు పల్లీల పొడిని వేసుకొని కలుపుకోండి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసుకొని, 1 టీ కప్పు వరకు నీళ్లు పోసుకొని కలిపి మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుకుంటూ తక్కువ మంట మీద నిమిషాలు ఉడికించుకోవాలి.
-తర్వాత అందులో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. కూర చిక్కగా రెడీ అయ్యాక అందులో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేయండి.
-అంతే క్యాప్సికం టమాటో మసాలా కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications