Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Creamy mushroom curry: పుట్టగొడులతో ఈ కర్రీ ట్రై చేశారా?.. రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.. క్రీమి క్ర
పుట్టగొడుగులతో వంటలు చాలా మందికి ఇష్టం ఉంటాయి. వీటితో రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటారు. పుట్టగొడుల కూర రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఈ పుట్టగొడులతో కొంచెం క్రీమిగా ఉండే విధంగా కూర కూడా చేసుకోవచ్చు. ఈ కూర రుచి వారేవా అనే విధంగా ఉండడంతో పాటు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఈ క్రీమి పుట్టగొడుగుల కూరను ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధమైన పద్దతిలో దీనిని చేసుకోవాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

క్రీమి పుట్టగొడుగుల కర్రీ తయారు చేసుకునే విధానం
- 300 గ్రాముల పుట్టగొడుగులు
- రెండు టేబుల్ స్పూన్ల బటర్
- సన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము
- సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ
- ఒక టేబుల్ స్పూన్ నూనె
- రుచికి సరిపడా ఉప్పు
- ఒక టేబుల్ స్పూన్ కారం
- ఒక కప్పు క్రీమ్
- అర టీస్పూన్ గరం మసాలా
- కాస్త కసూరీమేతి
- ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు
క్రీమి పుట్టగొడుగుల కర్రీ తయారీ విధానం
ముందుగా పుట్టగొడుగులను శుభ్రంగా కడుక్కోవాలి. ఒకవేళ పుట్టగొడుగులు పెద్దగా ఉంటే వాటిని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో కొంచెం బటర్, నూనె వేసుకోవాలి. బటర్ కరిగి చిన్న చిన్నగా బుడగలు వస్తుండగా అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. వాటిని కాస్త గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా, పచ్చి వాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఆ ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు అందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగుల ముక్కలను వేసుకోవాలి. అలానే అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని, ఆ పుట్టగొడుగులు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పుట్టగొడుగులు లేత బంగారు రంగులోకి వచ్చిన తరువాత అందులో ఒక కప్పు క్రీం, కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. ఆ తరువాత కడాయిపై మూత పెట్టి సన్నటి మంట మీద ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు పుట్టగొడుగులతో పాటు అందులో వేసిన వస్తువులన్నీ వేగాకా అందులోనే గరం మసాలా, కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఆ తరువాత ఒక్క నిమిషం పాటు ఆ కర్రీని ఉడకనిస్తే క్రీమి పుట్టగొడుగుల కూర సిద్ధమైనట్లే.
ఈ కూరను అన్నంతో పాటు, చపాతీల్లో తింటే అదిరిపోతుంది. క్రీం, పుట్టగొడుగులు, అల్లం రుచి అంతా కలిసి అద్భుతమైన సరికొత్త రుచికి మనకు పరిచయం చేస్తుంది. ఈ కూరను కేవలం గంటలోనే సులభంగా చేసుకోవచ్చు. అలాగే ఈ కూరను తినడం వల్ల అందుతాయి. అలాగే రుచికి కూడా ఏ మాత్రం తగ్గదు. ఈ ఆదివారం రోజు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications