Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
చపాతీ, నాన్ లోకి అదిరిపోయే నార్త్ ఇండియా స్పెషల్ మలై గోబీ..ఈ రుచి జన్మలో మర్చిపోలేరు!
సాధారణంగా క్యాలీఫ్లవర్ అనగానే చాలామందికి ఏదో రొటీన్ కూర మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ ప్రతిరోజూ వండుకునే ఆ సాధారణ క్యాలీఫ్లవర్ ను ఒక అద్భుతమైన, కమ్మని వంటకానిగా మార్చే నార్త్ ఇండియన్ స్పెషల్ రెసిపీయే ఈ మలై గోబీ.
పేరు వింటేనే నోరూరించే ఈ వంటకం, తన క్రీమీ టెక్స్చర్ తో, అద్భుతమైన రుచితో భోజన ప్రియుల మనసు దోచుకుంటుంది. వేడి వేడి చపాతీ, నాన్, బటర్ రోటీ లేదా జీరా రైస్ తో ఈ కూరను కలుపుకొని తింటుంటే ఆ మజానే వేరు. మలై గోబీ మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
క్యాలీఫ్లవర్ - 1
ఫ్రెష్ క్రీమ్ (మలై) - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
జీడిపప్పు పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - అర టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
తాజా కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా మీడియం సైజులో కట్ చేసిన క్యాలీఫ్లవర్ ముక్కలను శుభ్రం చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు మరిగించి, కొద్దిగా ఉప్పు వేసి అందులో ఈ ముక్కలను వేసి 3-4 నిమిషాల పాటు ఉంచాలి (బ్లాంచ్ చేయడం). దీనివల్ల ముక్కలు శుభ్రపడటమే కాకుండా కొద్దిగా మెత్తబడతాయి. ఆ తర్వాత నీటిని వంపేసి ముక్కలను పక్కన పెట్టుకోవాలి.
-స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నెయ్యి లేదా నూనె వేడి చేయండి. నెయ్యి వాడితే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించండి.
-ఇప్పుడు మంటను సిమ్ లో పెట్టి కడాయిలో పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపాక ముందుగా రుబ్బి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి నూనె పైకి తేలేవరకు (2-3 నిమిషాలు) ఉడికించాలి. ఈ గ్రేవీయే కూరకు అసలైన కమ్మదనాన్ని ఇస్తుంది.
-ఈ గ్రేవీలో ముందుగా సిద్ధం చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి, మసాలా అంతా ముక్కలకు పట్టేలా నిదానంగా కలపాలి. మూతపెట్టి చిన్న మంట మీద 8 నుండి 10 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్క మరీ మెత్తగా పేస్ట్ లా కాకుండా చూసుకోవాలి.
-కూర చక్కగా ఉడికిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించి, ఫ్రెష్ క్రీమ్, గరం మసాలా చల్లి నెమ్మదిగా కలపాలి. మరో రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే ఘుమఘుమలాడే మలై గోబీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications