Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నం.. దేనిలోకైనా అదరగొట్టే స్మోకీ ఆలు-టమాటా చట్నీ
ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం ఒక ఎత్తైతే, దానికి నంచుకోవడానికి ఏ చట్నీ చెయ్యాలి? అని ఆలోచించడం మరొక ఎత్తు. ఇడ్లీ, దోశ అనగానే మనకు గుర్తొచ్చేది పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ. కానీ రోజూ అదే రుచి అంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అందుకే ఈసారి మీ ఇంట్లో కేవలం రెండు టమాటాలు, ఒక బంగాళాదుంప ఉంటే చాలు.. నిమిషాల్లో ఈ అద్భుతమైన చట్నీ రెడీ అయిపోతుంది.
ఈ చట్నీ ప్రత్యేకత ఏమిటంటే..ఇందులో మనం కూరగాయలను ఉడికించం.. నేరుగా నిప్పుల మీద కాల్చి చేస్తాం. దీనివల్ల చట్నీకి ఒక అద్భుతమైన స్మోకీ ఫ్లేవర్ (కాల్చిన వాసన) వస్తుంది. ఇది కేవలం ఇడ్లీ, దోశలకే కాదు.. వేడివేడి చపాతీ, పూరీ, చివరికి అన్నంలోకి కూడా అదిరిపోతుంది. ఈ వెరైటీ టమాటా-బంగాళాదుంప రోస్ట్ చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
పెద్ద బంగాళాదుంప - 1
టమోటాలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 6 నుండి 7
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ఎండు మిరపకాయలు - 2
పెరుగు - 1 టీస్పూన్
కారం పొడి - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - గార్నిష్ కోసం కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా బంగాళాదుంప, టమాటాలను శుభ్రంగా కడగాలి. స్టవ్ వెలిగించి ఒక గ్రిల్ (పుల్కా కాల్చే జాలి) పెట్టి దానిపై బంగాళాదుంపను ఉంచండి. మంటను మీడియంలో పెట్టి బంగాళాదుంప పై తొక్క నల్లగా మారి లోపల మెత్తగా ఉడికేంత వరకు అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి.ః
-అదే విధంగా టమాటాలను,వెల్లుల్లి రెబ్బలను కూడా నిప్పుల మీద పెట్టి, వాటి తొక్క నల్లగా మారేంత వరకు కాల్చుకోవాలి.
-కాల్చిన కూరగాయలు కాస్త చల్లారిన తర్వాత, బంగాళాదుంప, టమాటాల పైన నల్లగా మారిన తొక్కను నెమ్మదిగా వలిచేయండి.
-ఇప్పుడు ఒక రోలు లేకపోతే గిన్నెలో వేసి పప్పు గుత్తితో మెదపవచ్చు. ముందుగా కాల్చిన బంగాళాదుంప, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచాలి. మరీ మెత్తని పేస్ట్ లా చేయకూడదు.
-ఆ తర్వాత అందులోనే కాల్చిన టమాటాలను కూడా వేసి, వాటిని కూడా బాగా మెదపాలి. బంగాళాదుంప, టమాటా గుజ్జు బాగా కలిసేలా చూసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక ఎండుమిర్చి వేసి వేయించండి. తర్వాత మనం రెడీ చేసుకున్న టమాటా-బంగాళాదుంప మిశ్రమాన్ని నూనెలో వేసి బాగా కలపాలి.
-ఈ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, కారం పొడి, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. పెరుగు వేయడం వల్ల చట్నీకి మంచి క్రీమీ టెక్చర్ వస్తుంది. సన్నని మంటపై 2-3 నిమిషాల పాటు ఉడికించండి. నూనె పైకి తేలుతున్నప్పుడు కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే ఎంతో ఘుమఘుమలాడే స్మోకీ టమాటా ఆలు చట్నీరెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








