For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రీమీ టమోటో మరియు పాలకూర పాస్తా రెసిపి

క్రీముతో కూడిన టమాటో మరియు పాలకూర పాస్తా చాలా సులభమైన రెసిపి. ఇందులో చాలా ఐరన్ మరియు విటమిన్లు ఉండి మంచి రుచిని అందిస్తుంది. దీన్ని చేయటం అస్సలు కష్టమేమీ కాదు.దీనికి మరింత క్రీమ్ లేదా చీజ్ జతచేసి మరిం

Posted By: DEEPTHI T A S
|

క్రీముతో కూడిన టమాటో మరియు పాలకూర పాస్తా చాలా సులభమైన రెసిపి. ఇందులో చాలా ఐరన్ మరియు విటమిన్లు ఉండి మంచి రుచిని అందిస్తుంది. దీన్ని చేయటం అస్సలు కష్టమేమీ కాదు.దీనికి మరింత క్రీమ్ లేదా చీజ్ జతచేసి మరింత క్రీమీగా, రుచిగా మార్చుకోండి. వారంలో రాత్రి భోజనానికి సరిపోయే ఈ సింపుల్, రుచికర పాస్తా వంటకాన్ని ఎలా తయారుచేయాలో నేర్చుకోండి.

క్రీమీ టమాటా మరియు పాలకూర పాస్తా రెసిపి । క్రీమీ టమాటా పాస్తాను ఎలా తయారుచేయాలి । టమాటా మరియు పాలకూరతో క్రీమీ పాస్తా । పాస్తా రెసిపి
క్రీమీ టమాటా మరియు పాలకూర పాస్తా రెసిపి । క్రీమీ టమాటా పాస్తాను ఎలా తయారుచేయాలి । టమాటా మరియు పాలకూరతో క్రీమీ పాస్తా । పాస్తా రెసిపి
Prep Time
15 Mins
Cook Time
7M
Total Time
22 Mins

Recipe By: చెఫ్ గౌరవ్ ఛడ్డా

Recipe Type: స్నాక్స్

Serves: 3కి

Ingredients
  • నీరు -1 లీటరు

    ఉప్పు రుచికి తగినంత

    మాకరోని -2 కప్పులు

    ఆలివ్ నూనె -2 చెంచాలు

    వెల్లుల్లి రెబ్బలు- తరిగినవి -4

    చిన్న ఉల్లిపాయ - తరిగినది -1

    మధ్య సైజు టమాటా, తరిగినది -2

    మధ్య సైజు మష్రూమ్స్, తరిగినది -3

    పాలకూర, తురిమినది -1 కట్ట

    డైట్ మయోన్నైస్ -5 చెంచాలు

    నల్ల మిరియాల పొడి -1 చెంచా

    ఎర్ర బియ్యం కంద పోహా

How to Prepare
  • ఒక కుండలాంటి పాత్రను తీసుకుని నీటితో నింపి మరిగించండి.

    మాకరోని మరియు ఉప్పును వేయండి.

    ప్యాక్ పై ఉన్న సూచనల ప్రకారం 5 నిమిషాల పాటు వండండి.

    మాకరోని అడుగున అంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి.

    ఒక గరిటెను వాడుతూ 120 మిలీల పాస్తా స్టాకును బీకర్లో పోయండీ.

    ఉడికిన పాస్తాను జల్లెడపట్టి కొలాండర్లోకి మార్చండి.

    నాన్ స్టిక్ పెనంలో నూనెను వేడిచేయండి (సన్న మంటపై)

    వెల్లుల్లి, ఉల్లిముక్కలను వేసి ఉల్లిపాయ రంగు మారేదాకా సుమారు 30 సెకన్లపాటు వేయించండి.

    టమాటాను వేసి మెత్తబడే వరకు 1-2 నిమిషాల పాటు ఉడికించండి.

    మష్రూమ్, పాలకూర ముక్కలను వేసి పాలకూర నుంచి నీరంతా పోయేదాకా 2-3 నిమిషాలు వేయించండి.

    చిటికెడు ఉప్పు, మిరియాల పొడి వేసి రుచిని పెంచండి.

    పైన కాయగూరలతో పాటు పాస్తా స్టాకును కూడా వేసి కలపండి.

    మంటపై నుంచి పాన్ ను తీసేయండి.

    ఇప్పుడు మయోన్నైస్ వేసి బాగా కలపండి.

    మళ్ళీ స్టవ్ పై పెటి, 1 నిమిషం పాటు సన్నమంటపై ఉంచండి లేదా సాస్ గట్టిపడేవరకూ ఉంచండి.

    పై సాస్ కి మాకరోని జత చేసి మొత్తం పట్టేట్లా తిరగేస్తూ కలపండి.

    ఈ వంటకాన్ని అందంగా అలంకరించి వేడిగా వడ్డించండి.

Instructions
  • మీరు మీకు నచ్చిన ఏ రకమైన పాస్తానైనా వాడవచ్చు.
Nutritional Information
  • సరిపోయే పరిమాణం - 1 కప్పు
  • క్యాలరీలు - 287 క్యాలరీలు
  • కొవ్వు - 10 గ్రాములు
  • ప్రొటీన్ - 10 గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 41 గ్రాములు
  • చక్కెర - 5 గ్రాములు
  • ఫైబర్ - 3 గ్రాములు
[ 5 of 5 - 10 Users]
English summary

Creamy Tomato And Spinach Pasta Recipe | How To Prepare Creamy Tomato Pasta | Creamy Pasta With Tomato And Spinach | Pasta Recipe,

Creamy tomato and spinach pasta is an authentic Italian recipe that is prepared as an evening snack or for dinner. The creamy pasta with tomato and spinach is an ideal main course for vegetarians. Here is a simple recipe on how to make the creamy tomato and spinach macaroni with a detailed step-by-step procedure.
Story first published: Wednesday, January 3, 2018, 15:22 [IST]
Desktop Bottom Promotion