Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
ఒకవైపు కరకరలాడుతూ,మరోవైపు మెత్తగా..సూపర్ టేస్టీ తపాలా చక్కలు ఎలా చేసుకోవాలంటే..
తపాలా చక్కలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో బాగా ప్రాచుర్యం పొందిన రుచికరమైన, కరకరలాడే స్నాక్. వీటిని ప్రధానంగా బియ్యప్పిండి, పప్పులతో తయారు చేయడం వల్ల కొన్ని పోషక అంశాలు లభిస్తాయి. ఒకవైపు కరకరలాడుతూ,మరోవైపు మెత్తగా మధ్యమధ్యలో పెసరపప్పు తగులుతూ నోటికి అద్భుతమైన రుచిని అందించే తపాలా చక్కలు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తపాలా చక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసరపప్పు
-రాళ్ల ఉప్పు
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-కరివేపాకు
-కొత్తిమీర
-బియ్యం పిండి
-నూనె
-జీలకర్ర
తపాలా చక్కలు తయారీ విధానం
-ముందుగా రెండు గుప్పెళ్ల పెసరపప్పుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో రెండు గ్లాసుల మంచినీళ్లు, సరిపడా రాళ్ల ఉప్పు, కొంచెం జీలకర్ర, నానబెట్టిన పెసరపప్పు వేసి ఒకసారి మంచిగి కలుపుకోండి. ఎసరు తెర్లకాగుతున్నప్పుడు మంటను తగ్గించి ఇందులో 2 గ్లాసుల బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. 3-4 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది.
-తర్వాత ఉడికించిన బియ్యం పిండిని ఓ గిన్నెలోకి తీసుకొని అందులో చక్రాలుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర తరుగు, సన్నని ఉల్లిపాయ తరుగు వేసి అన్నీ కలిసేలా మంచిగా చేత్తో కలుపుకోవాలి. కలిపేటప్పుడు చేతికి నూనె రాసుకోండి.
-కలిపిన పిండిని చేత్తుల్లోకి కొంచెం కొంచెంగా ముద్దల్లా తీసుకొని అరిటాకు లేదా బటర్ పేపర్ మీద కొంచెం నూనె రాసుకొని దాని మీద పిండి ముద్దను పెట్టి అప్పచ్చిలా వత్తుకోవాలి. మరీ పల్చగా వత్తుకోవద్దు..కొంచెం మందంగానే ఉండాలి. మధ్యలో రంధ్రం పెట్టుకోవడం కూడా మర్చిపోవద్దు.
-తర్వాత అడుగు మందంగా ఉండే బాండీని స్టవ్ మీద పెట్టి అందులో వేగడానికి సరిపడా మాత్రమే నూనె వేసి ఒక్కో చెక్కను విడి విడిగా వేయించుకోవాలి. ఒకవైపు కరకరలాడే దాకా వేయిస్తే సరిపోతుంది..రెండో వైపు తిప్పి వేయించక్కర్లేదు.
-వేగిన తర్వాత నూనె నుంచి తీసి, టిష్యూ పేపర్ వేసిన ప్లేట్ లోకి తీసుకుంటే అదనపు నూనె పీల్చుకుంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు కరకరలాడుతూ ఉంటాయి
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












