Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
పండుగల స్పెషల్ క్రిస్పీ జొన్న మురుకులు..రుచికే కాదు ఆరోగ్యానికి కూడా రారాజు..ఎలా చేసుకోవాలంటే
మురుకులు భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాదిన ప్రసిద్ధి చెందిన చిరుతిండి. వీటిని సాధారణంగా బియ్యపు పిండి, శనగపిండి లేదా మినప్పిండితో తయారు చేస్తారు. అయితే జొన్న పిండితో చేసే మురుకులు కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జొన్నల్లో ఉండే పోషకాల వల్ల ఈ మురుకులు మరింత ప్రత్యేకంగా నిలుస్తాయి. జొన్న పిండి మురుకులను తయారు చేయడానికి కావాల్సిప పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-జొన్న పిండి
-వేడి నీళ్లు
-ఆయిల్
-పుట్నాల పప్పు
-జీలకర్ర
-కారం
-ఇంగువ
-వాము
-నువ్వులు
-పసుపు
-ఉప్పు
-ధనియాలు

-ముందుగా ఓ పెద్ద గిన్నెలో అర కేజీ జొన్న పిండి(4 కప్పులు) వేయండి.
-తర్వాత జొన్న పిండిలో సరిపడా వేడి నీళ్లు పోసి కలపాలి. ఇందుకోసం స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో సరిపడా నీళ్లు పోసి వేడి చెయ్యాలి.
-నీళ్లు వేడయ్యేలోపు మిక్సీ గిన్నెలో 1 కప్పు(125గ్రా) పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి మొత్తాన్ని మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు జొన్న పిండిలో గ్రైండ్ చేసిన పుట్నాల పిండిని,రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ ఇంగువ, 2 టీస్పూన్ల కారం, 1 టీస్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, చిటికెడు పసుపు వేసి, సరిపడా వేడి నీళ్లను కొంచెం కొంచెంగా పోసి మెత్తం కలిసేలా పిండి ముద్దను కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకోవద్దు.
-కలిపిన పిండిముద్దను 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత మురుకులు చేసే యంత్రాన్ని (మురుకు మేకర్, చక్రాల గొట్టం) శుభ్రం చేసి, దాని లోపలి భాగంలో కొద్దిగా నూనె రాయండి. మీరు కోరుకున్న ఆకారం (సాధారణంగా మూడు రంధ్రాల లేదా స్టార్ ఆకారం) ఉన్న ప్లేట్ ను యంత్రంలో అమర్చండి.
-సిద్ధం చేసుకున్న పిండి ముద్దలో కొంత భాగాన్ని తీసుకుని, యంత్రంలో వేయండి.
-ఒక ప్లాస్టిక్ షీట్ లేదా బట్టర్ పేపర్ లేదా గరిటెపై కొద్దిగా నూనె రాసి, దానిపై మురుకు యంత్రాన్ని తిప్పుతూ గుండ్రని ఆకారంలో మురుకులను ఒత్తాలి. మురుకుల చివరలను కలిపి మూయండి, లేదంటే నూనెలో వేసినప్పుడు విడిపోతాయి.
-ఇప్పుడు స్టవ్ మీ పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి వేడి చేశాక వత్తుకున్న మురుకులను ఆయిల్ లో వేయాలి.
-మురుకులు మంచిగా వేగాక ఆయిల్ నుంచి తీసేయాలి. అంతే టేస్టీ,క్రిస్పీ జొన్నపిండి మురుకులు రెడీ. చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే, ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి.
-జొన్న పిండి మురుకులు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ ఇవి వేయించిన వంటకం. కాబట్టి వాటిని మితంగా తీసుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా, మీరు పిండిని సిద్ధం చేసేటప్పుడు తక్కువ నూనె వాడటం లేదా ఎయిర్ ఫ్రైయర్ లో బేక్ చేయడం ద్వారా కూడా వీటిని తయారు చేయవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications