Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా!
ఎండాకాలం వచ్చేసింది.. స్కూల్స్ అన్నీ హాఫ్ డేస్ అయిపోయాయి. మధ్యాహ్నం ఇంటికి రాగానే పిల్లలకు ఆకలి మొదలవుతుంది. అమ్మా.. తినడానికి ఏమైనా ఉందా? అంటూ కిచెన్ చుట్టూ తిరుగుతుంటారు. రోజూ ఇచ్చే బిస్కెట్లు, కారప్పూస, మురుకులు ఇస్తే మొహం మాడ్చుకుంటారు. ఇవి మాకు వద్దు.. ఏదైనా కొత్తగా, వెరైటీగా చేసి పెట్టు అని మారం చేస్తుంటారు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే గోల చేస్తున్నారా?

అయితే వాళ్ల కోసం బయట దొరికే జంక్ ఫుడ్ కాకుండా, ఇంట్లోనే ఎంతో కరకరలాడే బెండకాయ పకోడీ చేసి పెట్టండి. సాధారణంగా పిల్లలు కూరగాయలు తినడానికి ఇష్టపడరు. కానీ, ఇలా బెండకాయతో కుర్ కురే లాంటి పకోడీలు చేసి పెడితే.. ఒక్కటి కూడా వదలకుండా లాగించేస్తారు. రొటీన్ ఉల్లిపాయ పకోడీ కంటే ఇది ఎంతో రుచిగా ఉంటుంది, పైగా చేయడం కూడా చాలా తేలిక.
బెండకాయ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు
లేత బెండకాయలు - అర కేజీ
శనగపిండి - ఒకటిన్నర కప్పు
బియ్యప్పిండి - పావు కప్పు
కారం - ఒకటిన్నర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
గరం మసాలా - అర టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
నిమ్మరసం - 2 టీస్పూన్లు
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

బెండకాయ పకోడీ తయారీ విధానం
-ముందుగా లేత బెండకాయలను నీటిలో శుభ్రంగా కడిగి, ఓ పొడి క్లాత్ తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత వాటి అటు, ఇటు చివర్లు కట్ చేయాలి.
-ఇప్పుడు ఒక్కో బెండకాయను తీసుకుని నిలువుగా సగానికి కోయాలి. ఆ సగ భాగాన్ని మళ్లీ సన్నగా, పొడవుగా కట్ చేయాలి. చూడ్డానికి అచ్చం కుర్ కురే షేప్ వచ్చేలా అన్నింటినీ కట్ చేసుకోండి.
-కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కల్లో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వేడి నూనె కూడా వేస్తే పకోడీలు మరింత గుల్లగా వస్తాయి. ఇప్పుడు చేతితో కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పకోడీ పిండిలా కలుపుకోవాలి. బెండకాయలో సహజంగానే జిగురు ఉంటుంది. కాబట్టి నీళ్లు అతి తక్కువగా వాడాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా కాగాక, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బెండకాయ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ, నూనెలో విడివిడిగా పకోడీల్లా వేసుకోవాలి. ఈ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు, కరకరలాడేలా రెండు వైపులా గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి.
-బాగా వేగిన తర్వాత వాటిని తీసి, టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి మార్చుకుంటే అదనపు నూనె పీల్చేసుకుంటుంది. అంతే కరకరలాడే బెండకాయ పకోడీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications