Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
క్రిస్పీ బటర్ ఫ్లై చికెన్..సాయంత్రం స్నాక్ కి ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ లేదు!
సాయంత్రం వేళ ఏదైనా వేడివేడిగా, కరకరలాడే స్నాక్ తినాలనిపిస్తుందా? లేదా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వారికి కొత్తగా ఏదైనా చేసి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే బటర్ ఫ్లై చికెన్ రుచి చూడాల్సిందే.
చూడటానికి సీతాకోకచిలుక రెక్కల మాదిరిగా అందంగా, తినడానికి ఎంతో రుచికరంగా ఉండే ఈ వంటకం అందరికీ నచ్చుతుంది. బటర్ ఫ్లై చికెన్ రెసిపీని ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బోన్ లెస్ చికెన్: 800గ్రాములు
బంగాళాదుంపలు: 3
గుడ్లు: 2
మొక్కజొన్న పిండి:3 టేబుల్ స్పూన్లు
మైదా: 3 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్:2 టేబుల్ స్పూన్లు
వెనిగర్:2 స్పూన్లు
సోయా సాస్: ఒకటిన్నర స్పూన్
ఎర్ర కారం పేస్ట్:1 టేబుల్ స్పూన్
ఎర్ర కారం పొడి:1 స్పూన్
చాట్ మసాలా:1 స్పూన్
మిరియాల పొడి:1 టేబుల్ స్పూన్
ఉప్పు:రుచికి సరిపడా
నల్ల ఉప్పు: సరిపడా
నిమ్మరసం:2 టేబుల్ స్పూన్ల
నువ్వులు: గార్నిష్ కోసం
నూనె:వేయించడానికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా చికెన్ ముక్కలను చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకోండి.
-ఒక పెద్ద గిన్నెలో శుభ్రం చేసిన చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, చాట్ మసాలా, మిరియాల పొడి, తగినంత ఉప్పు, నల్ల ఉప్పు, సోయా సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, వెనిగర్, నిమ్మరసం, గిలక్కొట్టిన గుడ్లు, మొక్కజొన్న పిండి, మైదా వేసి చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టేలా కలపండి.
-కలిపిన మిశ్రమంపై మూత పెట్టి కనీసం 3 నుండి 4 గంటల పాటు పక్కన పెట్టండి.
-చికెన్ నానబెట్టిన సమయంలో బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి, తొక్క తీయకుండానే చిప్స్ మాదిరిగా చాలా సన్నని పొరలుగా కట్ చేసుకోండి.
-ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల మొక్కజొన్న పిండిలో కొంచెం నీరు కలిపి పల్చని మిశ్రమం తయారు చేసుకోండి. కట్ చేసిన బంగాళాదుంప ముక్కలను ఈ నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానబెట్టండి.
-మొక్క జొన్న పిండి నీళ్ళలో నానబెట్టిన బంగాళాదుంప ముక్కను ఒకదానిని తీసుకోండి. దాని మధ్యలో మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కను ఉంచండి. బంగాళాదుంపను చికెన్ చుట్టూ మడిచి, అది ఊడిపోకుండా మధ్యలో ఒక టూత్ పిక్ ను గుచ్చండి. ఇప్పుడు అది చూడటానికి సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఇలా చికెన్ ముక్కలన్నింటినీ బంగాళాదుంపలతో మడిచి సిద్ధం చేసుకోండి.
-స్టవ్ మీద ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి.
-నూనె బాగా వేడెక్కాక మంటను తగ్గించి సిద్ధం చేసుకున్న బటర్ ఫ్లై చికెన్ ముక్కలను మెల్లగా నూనెలో వేయండి. బంగాళాదుంప మాడిపోకుండా, లోపల చికెన్ బాగా ఉడికేలా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
-బాగా వేగిన చికెన్ ముక్కలను టిష్యూ పేపర్ మీదకు తీసుకోండి. చివరగా వేడివేడి చికెన్ పై కొంచెం వేయించిన నువ్వులు చల్లుకుంటే చూడటానికి బాగుంటుంది, తినేటప్పుడు క్రంచీగా తగులుతుంది.
-అంతే ఎంతో రుచికరమైన, క్రిస్పీ బటర్ ఫ్లై చికెన్ రెడీ. దీనిని టమాటో కెచప్ లేదా మయోన్నైస్ తో కలిపి వేడివేడిగా తింటే స్వర్గం కనబడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications