Latest Updates
-
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్!
కరకరలాడే క్యాబేజీ టిక్కీలు..క్యాబేజీ వద్దు అన్నవాళ్లే ప్లేట్లు ఖాళీ చేస్తారు
క్యాబేజీ కనిపిస్తే చాలు చాలా మంది ముఖం తిప్పుకుంటారు. ఆ మాటకొస్తే.. ఇంట్లో క్యాబేజీ కూర వండుతున్నారంటే చాలు, పిల్లల నుంచి పెద్దల వరకు ఈ రోజు నేను అన్నం తినను బాబోయ్ అని మారాం చేస్తుంటారు. కానీ పోషకాల పరంగా చూస్తే క్యాబేజీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి ఇంట్లో వాళ్లతో, ముఖ్యంగా పిల్లలతో క్యాబేజీని ఇష్టంగా ఎలా తినిపించాలి? ఎప్పుడూ రొటీన్ గా చేసే కూరలు, ఫ్రైలు కాకుండా ఇలా కరకరలాడే క్యాబేజీ టిక్కీలు చేయండి. నాకు క్యాబేజీ వద్దు అన్నవాళ్లే మరో రెండు టిక్కీలు కావాలి అని అడిగి మరీ తింటారు.

క్యాబేజీ టిక్కీలు తయారీకి కావాల్సిన పదార్థాలు
సన్నగా తురిమిన క్యాబేజీ - 4 కప్పులు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కొత్తిమీర తరుగు - కొద్దిగా
కరివేపాకు - 2 రెమ్మలు
ధనియాల పొడి - అర టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ లేదా కారం- అర టీస్పూన్
ఇంగువ - చిటికెడు
శనగపిండి - అర కప్పు
బియ్యప్పిండి - అర కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

క్యాబేజీ టిక్కీలు తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో సన్నగా తురుముకున్న క్యాబేజీని వేయాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు కలపడం వల్ల క్యాబేజీలోని నీరంతా బయటకు వస్తుంది. దీనిపై మూత పెట్టి కనీసం 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
-ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకును వీలైనంత సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.
-పది నిమిషాల తర్వాత క్యాబేజీ మిశ్రమాన్ని తీసుకుని, చేత్తో గట్టిగా పిండుతూ అందులోని నీటిని పూర్తిగా తొలగించాలి. ఇలా నీరు పిండేసిన క్యాబేజీని మరో పొడి గిన్నెలోకి తీసుకోవాలి.
-ఇప్పుడు ఈ క్యాబేజీ తురుములో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ముక్కలను వేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్, చిటికెడు ఇంగువ వేసి.. మసాలాలన్నీ క్యాబేజీకి పట్టేలా బాగా మిక్స్ చేయాలి.
-తర్వాత ఈ మిశ్రమంలో అర కప్పు శనగపిండి, కరకరలాడటం కోసం అర కప్పు బియ్యప్పిండి వేసి, చపాతీ పిండి ముద్దలా గట్టిగా కలుపుకోవాలి. క్యాబేజీలో ఉండే చెమ్మ సరిపోతుంది కాబట్టి, ఇందులో అదనంగా నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు.
-ఇప్పుడు రెండు చేతులకు కొద్దిగా నూనె రాసుకుని, పిండి ముద్దను కొద్దికొద్దిగా తీసుకుంటూ గుండ్రంగా, కాస్త మందంగా ఉండేలా టిక్కీల ఆకారంలో (కట్ లెట్స్ లాగా) ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి.
-స్టవ్ ఆన్ చేసి, మందపాటి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్ లోకి మార్చి.. తయారు చేసుకున్న టిక్కీలను నెమ్మదిగా నూనెలో వేయాలి. ఇవి వెంటనే తిప్పకుండా, ఒకవైపు కొద్దిగా వేగాక గరిటెతో రెండో వైపుకు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా దోరగా వేయించుకోవాలి.
-వేగిన తర్వాత వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో గుమగుమలాడే, నోరూరించే కరకరలాడే క్యాబేజీ టిక్కీలు రెడీ. వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని టమాటో కెచప్ లేదా గ్రీన్ చట్నీతో నంచుకుని తింటే ఆ మజాయే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications