Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
మిగిలిపోయిన రోటీలు లేదా చపాతీలతో అదిరిపోయే పిజ్జా..10 నిమిషాల్లోనే చేసేయండిలా
రాత్రి భోజనం పూర్తయ్యాక రోటీలు మిగిలిపోతే వాటిని పారేయలేక ఫ్రిజ్లో దాస్తాం. తీరా మరుసటి రోజు ఉదయం వాటిని చూస్తూ..దీనితో ఇప్పుడు ఏం చేయాలి? అని ఆలోచిస్తుంటాం. మళ్లీ అదే కూరతో తినాలంటే బోర్ కొడుతుంది. మీరు కూడా ఇదే సమస్యతో సతమతమవుతుంటే మిగిలిపోయిన రోటీతో పిజ్జా చేయండి.
సాధారణంగా పిల్లలు పిజ్జా పేరు చెబితే ఎగిరి గంకేస్తారు. కానీ బయట దొరికే పిజ్జాలు మైదా పిండితో చేయడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే గోధుమ పిండితో చేసిన మన ఇంటి రోటీలతో పిజ్జా చేస్తే అది రెట్టింపు ఆరోగ్యం, అద్భుతమైన రుచిని ఇస్తుంది. కేవలం 10 నిమిషాల్లో రోటీ పిజ్జాను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
మిగిలిపోయిన రోటీలు లేదా చపాతీలు:2- 3
పిజ్జా సాస్: 2-3 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ: 1
క్యాప్సికమ్: సగం
టమోటా: 1
స్వీట్ కార్న్: 2 టేబుల్ స్పూన్లు
మోజారెల్లా చీజ్: తగినంత
ఒరేగానో, చిల్లీ ప్లేక్స్ :రుచికి సరిపడా
ఉప్పు: రుచికి తగినంత
వెన్న లేదా ఆలివ్ ఆయిల్: కాల్చడానికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ పాన్ లేదా దోశ పెనం పెట్టి వేడి చేయండి. దానిపై కొద్దిగా వెన్న లేదా ఆలివ్ నూనెను రాయండి.
-నూనె వేడెక్కాక మిగిలిపోయిన రోటీని పాన్ మీద వేయండి.క్రింది వైపు లేత గోధుమ రంగు వచ్చి, కాస్త కరకరలాడే వరకు కాల్చండి.
-ఇప్పుడు మంటను సిమ్ లో పెట్టండి. రోటీని తిరగేయండి . ఇప్పుడు ఆ రోటీపై పిజ్జా సాస్ ను అంచుల వరకు సమానంగా రాయండి.
-సాస్ రాసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమోటా ముక్కలు, స్వీట్ కార్న్ ను చల్లుకోండి. మీకు నచ్చితే పుట్టగొడుగులు లేదా పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవచ్చు.
-కూరగాయల మీద రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, ఒరేగానో హెర్బ్స్, చిల్లీ ప్లేక్స్ ను చల్లుకోండి. ఇవి పిజ్జాకు అసలైన ఇటాలియన్ రుచిని ఇస్తాయి.
-ఇప్పుడు తురిమిన మోజారెల్లా చీజ్ ను కూరగాయలన్నింటినీ కవర్ చేసేలా నిండుగా వేసి పాన్ పై మూత పెట్టండి. మంటను పూర్తిగా సిమ్ లోనే ఉంచి సుమారు 4 నుండి 5 నిమిషాల పాటు ఉడికించాలి. లోపల ఉన్న వేడికి చీజ్ పూర్తిగా కరిగి, కూరగాయలు కొద్దిగా మగ్గుతాయి.
-చీజ్ కరిగి రోటీ కింద భాగం మంచి గోల్డెన్ కలర్లోకి మారి క్రిస్పీగా అవ్వగానే స్టవ్ ఆపేయండి.
-అంతే వేడి వేడి, కరకరలాడే రోటీ పిజ్జా రెడీ. దీనిని చాకుతో నాలుగు ముక్కలుగా కట్ చేసి టమాటో సాస్ తో తింటే ఆహా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications