Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
కరకరలాడే జొన్న దిబ్బ రొట్టె..వారానికి రెండు సార్లు ఇది తింటే చాలు..డాక్టర్ అవసరమే ఉండదు!
నేటి కాలంలో ఫాస్ట్ ఫుడ్స్, మైదా వంటకాల వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మన పూర్వీకులు తిన్న జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను మళ్ళీ మన ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో అవసరం.
జొన్న దిబ్బ రొట్టె కేవలం ఒక రుచికరమైన వంటకం మాత్రమే కాదు అది ఒక సంపూర్ణ ఆరోగ్య గని. వారంలో కనీసం రెండు సార్లు ఇలాంటి చిరుధాన్యాల వంటకాలను తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండవచ్చు. వందలాది ప్రయోనాలను అందించే జొన్న దిబ్బ రొట్టె రుచిగా, కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినపప్పు
-నూనె
-జొన్న రవ్వ
-ఉప్పు
-నీళ్లు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఇందులో 1 కప్పు మినపప్పు వేసి నీళ్లు పోసి కడిగాక మళ్లీ నీళ్లు పోసి మినపప్పును కనీసం 4 గంటలు నానబెట్టుకోవాలి.
-ఇప్పుడు మరో గిన్నెలో 3 కప్పుల జొన్న రవ్వ వేసి రెండు సార్లు శుభ్రంగా కడిగాక నీళ్లు పోసి కనీసం 4 గంటలు నానబెట్టుకోవాలి.
-4 గంటల తర్వాత గ్రైండర్ లేదా మిక్సీ గిన్నెలో నానిన మినపప్పు వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత నానిన జొన్నరవ్వను చేతుల్లోకి తీసుకొని నీటిని అంతా పిండేసి ఆ రవ్వను గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో వేసి మెత్తం చేత్తో కలిసేలా బాగా కలుపుకున్నాక గిన్నె మీద మూత పెట్టి రాత్రంతా అలా వదిలేయండి.
-ఉదయాన్నే మూత తీసి పులిసిన ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోండి.
-తర్వాత స్టవ్ మీద అట్ల పెనం లేదా మందంగా ఉండే పాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత అందులో మూడు గరిటెడల పిండిని వేసి రొట్టెలా పర్చుకోండి.
-మంచిగా కాలి అంచులు సపరేట్ అవుతున్నప్పుడు రెండో వైపుకి తిరగేసుకోండి.2 నిమిషాలు కాలాక ఓ ప్లేట్ లోకి తీసుకోండి. అంతే క్రిస్పీ, హెల్దీ జొన్న దిబ్బ రొట్టె రెడీ. దీనిని నచ్చిన చట్నీతో ఆస్వాదించండి.
కొన్ని ప్రయోజనాలు
-జొన్నల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచదు. డయాబెటిస్ ఉన్నవారు జొన్న దిబ్బ రొట్టెను నిరభ్యంతరంగా తినవచ్చు.
-జొన్నల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఆహారం.
-జొన్నల్లో ఉండే పీచు పదార్థం, లిగ్నాన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
-జొన్నల్లో మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. క్రమం తప్పకుండా జొన్నలు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications