Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఆన్ లైన్ ఆర్డర్స్ వద్దు.. కరకరలాడే జ్యూసీ కొరియన్ ఫ్రైడ్ చికెన్ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి
బయట రెస్టారెంట్లలో దొరికే క్రిస్పీ, జ్యూసీ కొరియన్ ఫ్రైడ్ చికెన్ తినాలనిపిస్తోందా? ఫుడ్ యాప్స్ లో ఆర్డర్ చేసే పని లేకుండా, అచ్చం రెస్టారెంట్ రుచితో, అతి తక్కువ సమయంలో మీ ఇంట్లోనే కొరియన్ ఫ్రైడ్ చికెన్ తయారు చేసుకోవచ్చు. తీయగా, కారంగా, వెల్లుల్లి ఘాటుతో నోరూరించే ఈ కొరియన్ స్టైల్ స్టిక్కీ హనీ గార్లిక్ చికెన్ చేయడం చాలా తేలిక. 15 నిమిషాల్లోనే దీనిని ఈజీగా తయారుచేసుకోవచ్చు. పిల్లలైనా, పెద్దలైనా దీన్ని లొట్టలేసుకుంటూ తింటారు.

కొరియన్ ఫ్రైడ్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-2 పెద్ద చికెన్ బ్రెస్ట్ ముక్కలు
-1 టీస్పూన్ ఉప్పు
-1 టీస్పూన్ మిరియాల పొడి
-3 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్
-1 టీస్పూన్ వెల్లుల్లి పొడి
-2 టేబుల్ స్పూన్ల నూనె
-2 టేబుల్ స్పూన్ల టొమాటో పేస్ట్
-1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి
-1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె
-1/3 కప్పు సోయా సాస్
-2 టేబుల్ స్పూన్ల వెనిగర్
-1 టేబుల్ స్పూన్ తేనె
-1/3 కప్పు నీళ్లు
-కొద్దిగా నువ్వులు
-సన్నగా తరిగిన ఉల్లికాడలు (స్ప్రింగ్ ఆనియన్స్)
కొరియన్ ఫ్రైడ్ చికెన్ తయారీ విధానం
-ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఒక గిన్నెలో వేసుకోండి. అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ వేసి, ప్రతి చికెన్ ముక్కకు పిండి బాగా పట్టేలా కోట్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఒక పెద్ద పాన్ లో నూనె వేసి మీడియం మంట మీద వేడి చేయండి. ఇప్పుడు చికెన్ ముక్కలను ఒకదానికొకటి అంటుకోకుండా పాన్ అంతా పరుచుకునేలా వేయండి. పాన్ చిన్నదైతే రెండు సార్లు వేయించండి. ముక్కలు లోపల మెత్తగా ఉడికి, బయట బంగారు రంగు వచ్చేలా ప్రతి వైపు 3-4 నిమిషాల పాటు వేయించి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-చికెన్ వేయించిన పాన్ లోనే టొమాటో పేస్ట్, ప్రెష్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు 30 సెకన్ల పాటు తక్కువ మంట మీద వేయించండి. ఇప్పుడు అందులో నువ్వుల నూనె, సోయా సాస్, వెనిగర్, తేనె, నీళ్లు పోసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు ఉడకనిస్తే సాస్ కొద్దిగా చిక్కబడుతుంది.
-ఇప్పుడు ఆ చిక్కటి సాస్ లో ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేయండి. సాస్ ప్రతి ముక్కకూ పట్టి, చికెన్ ముక్కలు నిగనిగలాడుతూ అద్భుతంగా కనిపించే వరకు బాగా టాస్ చేయండి. అంతే చికెన్ రెడీ.
-ఒక బౌల్ లో వేడి వేడి అన్నం పెట్టుకుని, దానిపై ఈ స్టిక్కీ హనీ గార్లిక్ చికెన్ వేసుకోండి. పైన కొద్దిగా నువ్వులు, సన్నగా తరిగిన ఉల్లికాడలు చల్లి తింటుంటే ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications