Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
పైన క్రిస్పీ,లోపల జ్యూసీ..నోట్లో వెన్నలా కరిగిపోయే చంద్రకళ..తయారీ ఇలా
మన సంప్రదాయంలో ఏ పండుగ వచ్చినా, శుభకార్యం జరిగినా నోరు తీపి చేసుకోవడం ఆచారం. అయితే లడ్డూలు, జిలేబీల వంటి రెగ్యులర్ స్వీట్ల కంటే కాస్త భిన్నంగా, చూడగానే రాజసంగా కనిపించే స్వీట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా చంద్రకళ మాత్రమే. బీహార్ సాంప్రదాయ వంటకమైన చంద్రకళ స్వీట్ ఆకాశంలో నిండుగా మెరిసే చంద్రుడిని పోలి ఉంటుంది.
పైన క్రిస్పీగా ఉండే లేయర్, లోపల మెత్తని కోవా, డ్రై ఫ్రూట్స్ స్టఫింగ్, పైగా తియ్యటి పంచదార పాకం..ఇవన్నీ కలిసి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. ఈ స్వీట్ రుచి ముందు మిగతావన్నీ దిగదుడుపే అనిపిస్తుంది. ఇంతటి రుచికరమైన స్వీట్ ను ఇంట్లోనే చాలా సులభంగా, హైజీనిక్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మైదా: 300 గ్రాములు
పంచదార: 3 కప్పులు
కోవా: 150 గ్రాములు
బొంబాయి రవ్వ: 70 గ్రాములు
స్వచ్ఛమైన నెయ్యి: 3 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి: 1 టేబుల్ స్పూన్
బాదం పొడి: 2 టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి తురుము: 2 టేబుల్ స్పూన్లు
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ లో కోవా, బొంబాయి రవ్వను వేసి లేత గోధుమ రంగు వచ్చేవరకు దోరగా వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చాక ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు అందులో బాదం పొడి, కొబ్బరి తురుము, యాలకుల పొడి, స్టఫింగ్ కు సరిపడా పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇదే చంద్రకళ అసలైన రుచినిచ్చే స్టఫింగ్.
-ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో మైదా పిండి, మూడు స్పూన్ల నెయ్యి వేయాలి. పిండిని చేతితో పట్టుకుంటే ముద్దలా అవ్వాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా తడి గుడ్డ కప్పి 20 నిమిషాలు పక్కన పెట్టాలి.
-నానబెట్టిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పూరీల్లా ఒత్తుకోవాలి. ఒక పూరీని తీసుకుని దాని మధ్యలో ముందుగా సిద్ధం చేసుకున్న కోవా మిశ్రమాన్ని ఒక స్పూన్ ఉంచాలి. పూరీ అంచుల వెంబడి తడి చేసి, మరో పూరీని దానిపై కప్పి వేయాలి. లోపలి స్టఫింగ్ బయటకు రాకుండా అంచులను గట్టిగా అతికించి, వేళ్లతో డిజైన్ వచ్చేలా మడిచి సీల్ చేయాలి.
-కడాయిలో నూనె వేసి వేడయ్యాక మంటను తగ్గించాలి. నూనె మరీ వేడిగా ఉండకూడదు. తయారు చేసిన చంద్రకళలను నిదానంగా నూనెలో వేసి, చిన్న మంటపైనే బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-మరో పాన్ లో పంచదార, నీళ్లు పోసి తీగ పాకం వచ్చేవరకు మరిగించాలి. చివరగా వేయించిన చంద్రకళలను ఈ గోరువెచ్చని పాకంలో వేసి 2-3 నిమిషాలు ఉంచాలి. పాకం లోపలికి ఇంకిన తర్వాత బయటకు తీయాలి.
-అంతే ఎంతో రుచికరమైన, జ్యూసీగా ఉండే చంద్రకళ స్వీట్ రెడీ. దీనిని వేడిగా తిన్నా, చల్లారాక తిన్నా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications