Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇన్‌స్టాగ్రామ్‌లో దుమ్మురేపుతున్న దుబాయ్ ఇప్ఫా చికెన్..టేస్ట్ వేరే లెవల్..ఎలా చేసుకోవాలంటే..
సామాజిక మాధ్యమాలు (Social Media) మన ఆహారపు అలవాట్లపై ఎంతగానో ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో వచ్చే ఫుడ్ రీల్స్ చూస్తే ఎవరికైనా నోరూరకమానదు. అలా బాగా వైరల్ అయిన వంటకం దుబాయ్ ఇప్ఫా చికెన్.
దుబాయ్ అనగానే మనకు షవర్మా, అల్ ఫహమ్, మండి వంటి వంటకాలు గుర్తొస్తాయి. కానీ ఈ ఇప్ఫా చికెన్ తన ప్రత్యేకమైన మసాలా దట్టించి, జ్యూసీగా ఉండే రుచితో భోజన ప్రియులను ఆకర్షిస్తోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో వాడే మసాలాలు చికెన్ ముక్కల లోపలికి బాగా ఇంకి, తినేటప్పుడు పైన క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటుంది. దుబాయ్ ఫేమస్ ఇప్ఫా చికెన్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-చికెన్
-పెరుగు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-నిమ్మరసం
-కారం
-మిరియాల పొడి
-మసాలా పొడి
-పసుపు
-ఉప్పు
-నూనె
-చీజ్ స్లైస్ లు
-కోడిగుడ్లు
-పాలు
-వెల్లుల్లి
-కొత్తిమీర
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో పసుపు, కారం, మిరియాల పొడి, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు వేసి ఇందులో నిమ్మరసం కూడా పిండుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలా చేత్లో కలుపుకోండి.
-తర్వాత పెద్ద సైజు చికెన్ ముక్కలు లేదా లెగ్ పీసులు తీసుకొని వాటికి ఫోర్క్ తో లేదా కత్తితో లోతుగా మధ్య మధ్యలో గాట్లు పెట్టిండి. కలుపుకున్న మసలా మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టించి 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ముక్కలకు గాట్లు వల్ల మసాలా లోపలి వరకు వెళుతుంది.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఉడికించిన 2 కోడిగుడ్లు(లోపలి సొన లేకుండా)కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 చీజ్ స్లైస్ లు, కొద్దిగా పెరుగు, కొద్దిగా పాలు, ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి వేడి చేశాక అందులో పక్కన ఉంచిన పెద్ద సైజు చికెన్ ముక్కలను వేసి రెండు వైపులా బాగా కాలిన తర్వాత చికెన్ ముక్కల మీద గ్రైండ్ చేసి ఉంచిన పేస్ట్, కొంచెం కొత్తిమీర చల్లి మూత పెట్టి కొద్దిసేపు తక్కువ మంట మీద ఉంచాలి.
-తర్వాత మూత తీసి చూస్తే ఇప్ఫా చికెన్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications