Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
పప్పు నానబెట్టే పనిలేదు,గ్రైండర్ అవసరం లేదు..జస్ట్ 15 నిమిషాల్లో అటుకులతో క్రిస్పీ వడలు
మన తెలుగువారికి వడ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉదయం టిఫిన్ కైనా, సాయంత్రం స్నాక్స్ కైనా వడ మన జీవితంలో ఒక భాగమైపోయింది. సాధారణంగా మనం వడలు చేసుకోవాలంటే మినపప్పు లేదా శనగపప్పును గంటల తరబడి నానబెట్టాలి, ఆ తర్వాత గ్రైండర్ లో రుబ్బాలి. ఈ పని తలచుకుంటేనే చాలామంది వడలు చేసే సాహసం చేయరు.
ఎటువంటి పప్పు లేకుండా, నానబెట్టే పని లేకుండా చిటికెలో రుచికరమైన వడలు చేసుకోవచ్చని మీకు తెలుసా? మీ ఇంట్లో అటుకులు, కాస్త పెరుగు ఉంటే చాలు.. కేవలం 10-15 నిమిషాల్లో అద్భుతమైన వడలు మీ ముందు ఉంటాయి. మినప వడలకు ఏమాత్రం తీసిపోని రుచితో పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే అటుకుల వడ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
అటుకులు - 1 కప్పు
పుల్లని పెరుగు- పావు కప్పు
బియ్యం పిండి -3 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 2
అల్లం- చిన్న ముక్క
క్యారెట్ తురుము - పావు కప్పు
ఉల్లిపాయ - 1
కొత్తిమీర - గుప్పెడు
కరివేపాకు - రెండు రెమ్మలు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు మందపాటి అటుకులను తీసుకుని నీటిలో ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. అటుకుల్లో ఉండే దుమ్ము పోయేలా కడిగిన తర్వాత నీటిని పూర్తిగా వడకట్టేయాలి.
-నీరు వడకట్టిన అటుకులను ఒక గిన్నెలోకి తీసుకుని, దానికి పావు కప్పు పెరుగు జత చేయండి. పెరుగు అటుకులకు బాగా పట్టేలా కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచండి.
-15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అటుకులు పెరుగును పీల్చుకుని మెత్తగా ఉంటాయి. ఇప్పుడు వాటిని చేతితో మెత్తటి ముద్దలా పిసికి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు,కరివేపాకు, కొత్తిమీర తురిమిన క్యారెట్, ఉల్లిపాయ తరుగు వేసి మొత్తం కలిసేలా కలపండి.
-ఇప్పుడు ఆ మిశ్రమంలో 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. బియ్యం పిండి వేయడం వల్ల వడలు నూనె పీల్చకుండా కరకరలాడుతూ వస్తాయి. పిండి మరీ గట్టిగా ఉంటే ఒకటి రెండు స్పూన్ల నీళ్లు చల్లి, వడ పిండిలా గట్టిగా కలుపుకోవాలి.
-స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. చేతులకు కాస్త నూనె రాసుకుని నిమ్మకాయ సైజులో పిండిని తీసుకుని, అరచేతిలో పెట్టి వడలా ఒత్తుకోండి. కావాలంటే మధ్యలో చిన్న రంధ్రం పెట్టవచ్చు.
-నూనె వేడెక్కిన తర్వాత మంటను మీడియంలో ఉంచి, తయారు చేసుకున్న వడలను మెల్లగా నూనెలో వేయండి. రెండు వైపులా తిప్పుతూ బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
-బాగా వేగిన వడలను తీసి టిష్యూ పేపర్‌పై వేస్తే అదనపు నూనె పోతుంది. అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి అటుకుల వడలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications