Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
పైన క్రిస్పీగా,లోపల మెత్తగా..అటుకులు, గోధుమపిండితో హెల్దీ స్నాక్..టీ టైంకి పర్ఫెక్ట్
సాయంత్రం సమయంలో ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉండే ఈ సీజన్ లో వేడి వేడిగా ఏదైనా తినాలని మనసు లాగేస్తుంటది. అయితే ఈ సమయంలో మీ ఇంట్లో ఒక కప్పు అటుకులు ,కొంచెం గోధుమ పిండి ఉంటే చాలు పోహా వీట్ బైట్స్ తయారుచేసుకోవచ్చు. పోహా వీట్ బైట్స్..రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన స్నాక్. ఈ స్నాక్ ని తయారుచేయడం కూడా టీ పెట్టినంత ఈజీగా అయిపోతుంది. సాయంత్రం వేళ పిల్లలకు లేదా పెద్దలకు తేలికైన ఆహారంగా ఈ స్నాక్ బాగుంటుంది. అటుకులు, గోధుమపిండిని ఉపయోగించి తక్కువ నూనెతో, త్వరగా రుచికరమైన, పౌష్టిక స్నాక్ పోహా వీట్ బైట్స్ ను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-అటుకులు
-టమాటో
-పచ్చిమిరపకాయ
-అల్లం
-కరివేపాకు
-వెల్లుల్లి
-గోధుమపిండి
-శెనగపిండి
-కారం
-కరివేపాకు
-కొత్తిమీర
-ఉల్లిపాయ
-జీలకర్ర
-ఉప్పు
-పెప్పర్ పౌడర్
-ధనియా పౌడర్
-నూనె
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు అటుకులు వేయండి,నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్లు వంపేయండి.
-ఇప్పుడు కడిగిన అటుకుల్లో 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మూతపెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి.
-5 నిమిషాలు నీటిలో నానిన అటుకులను చేత్తో కలుపుకోండి. మరీ మెత్తగా కలుపుకోవద్దు.
-తర్వాత మిక్సీ గిన్నెలో 1 టమాటో ముక్కలు, 1 పచ్చిమిరపకాయ, 1రెమ్మ కరివేపాకు, 3 వెల్లుల్లి రెబ్బలు,చిన్న అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోసుకోకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని అటుకుల్లో వేసి,ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల గోధుమపిండి, 1 టేబుల్ స్పూన్ శెనగపిండి, 1 టీస్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయ సన్నని తరుగు, పావు టీస్పూన్ ధనియా పౌడర్, పావు టీస్పూన్ పెప్పర్ పౌడర్, అర టీస్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర తరుగు వేసి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు,కారం సరిపోకుంటే ఈ దశలోనే వేసి కలుపుకోండి.
-ఇప్పుడు చేతులకు కొంచెం ఆయిల్ రాసుకొని కలిపిన పిండిని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని టిక్కీల్లా వత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఉండేలా చిన్నవిగా వత్తుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో డీప్ ఫ్రై చేయడానికి తగినదానికంే కొంచెం తక్కువగానే ఆయిల్ వేసి వేడి చేశాక అందులో వత్తుకున్న టిక్కీలను వేసి రెండువైపులా ఎర్రగా కాల్చుకొని దించేయండి. అంతే వేడి వేడి అటుకుల టిక్కీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







