Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బిస్కెట్లు, చిప్స్ ఎందుకు..పిల్లలకు ఈ హెల్దీ స్వీట్ పొటాటో పాన్ కేక్స్ ఇవ్వండి..చేయడం చాలా ఈజీ
సాయంత్రం అయిందంటే చాలు స్కూల్ నుండి లేదా ఆటల నుండి ఇంటికి వచ్చిన పిల్లలు అమ్మా ఆకలి అంటూ వంటింట్లోకి వస్తారు. ఆ సమయంలో వారికి ఏదో ఒక బిస్కట్టో, చిప్స్ ప్యాకెట్టో ఇచ్చే బదులు, వారి ఆకలిని తీరుస్తూనే ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాన్ని ఇవ్వాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. వారికి ఈ సీజన్ లో ఎక్కువగా లభించే చిలగడదుంపలతో పాన్ కేక్స్ చేసి పెడితే సూపర్ అని తినేస్తారు.
చిలగడదుంపలు పోషకాల గని. వీటిలో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మామూలుగా ఉడకబెట్టి ఇస్తే పిల్లలు తినకపోవచ్చు, కానీ ఇలా పాన్ కేక్స్ లా చేసి పెడితే లొట్టలేసుకుంటూ తింటారు. ఇది చేయడం చాలా సులభం, పైగా దీని రుచి అద్భుతంగా ఉంటుంది. చిలగడదుంప పాన్ కేక్స్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
చిలగడదుంపలు - 200 గ్రాములు
బొంబాయి రవ్వ -ముప్పావు కప్పు
పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
కాచి చల్లార్చిన పాలు - 1 కప్పు
చక్కెర - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - ఒక చిటికెడు
నెయ్యి - కాల్చడానికి సరిపడా
తెల్ల నువ్వులు - గార్నిష్ కోసం కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా చిలగడదుంపలను శుభ్రంగా కడిగి, పైన తొక్క తీసివేయాలి. వీటిని పెద్ద ముక్కలుగా కోసుకోవాలి.
-ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి, ఇడ్లీ ప్లేట్లపై ఈ ముక్కలను ఉంచి, మూతపెట్టి మీడియం మంటపై దాదాపు 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. ఇలా ఆవిరిపై ఉడికించడం వల్ల దుంపల్లోని పోషకాలు పోకుండా ఉంటాయి.
-చిలగడదుంపలు మెత్తగా ఉడికిన తర్వాత, వాటిని బయటకు తీసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చేతితో మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో బొంబాయి రవ్వ, తురిమిన కొబ్బరి, చిటికెడు ఉప్పు, కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలి. పిండి మరీ పల్చగా కాకుండా దోస పిండి కంటే కాస్త గట్టిగా ఉండేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు కలిపిన మిశ్రమంలో 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి బాగా కలిపి మూతపెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 5 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి గరిటెతో బాగా కలపాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడి చేయాలి. పెనం వేడెక్కాక కొద్దిగా నెయ్యి రాయాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న పిండిని చిన్న చిన్న ఊతప్పంలా లేదా పాన్ కేక్ లా పెనంపై వేసుకోవాలి. దీనిపైన కొద్దిగా తెల్ల నువ్వులు చల్లితే చూడటానికి బాగుంటుంది, తినేటప్పుడు కరకరలాడుతూ రుచిని ఇస్తుంది.
-చుట్టూ కొంచెం నెయ్యి వేసి, రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. రవ్వ వల్ల ఇది మంచి క్రిస్పీగా తయారవుతుంది. అంతే ఎంతో రుచికరమైన, వేడి వేడి చిలగడదుంప పాన్ కేక్స్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications