Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
నూనె లేకుండానే కరకరలాడే బ్రెడ్ పకోరా.. రుచి అద్భుతం, ఆరోగ్యం పదిలం!
వెదర్ కూల్ గా ఉన్న టైంలో లేదా సాయంత్రం వేళ ఆఫీసు నుండి ఇంటికి రాగానే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మనందరికీ ఠక్కున గుర్తొచ్చే స్నాక్ బ్రెడ్ పకోరా. దీని రుచికి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. మెత్తటి బ్రెడ్, లోపల కమ్మటి ఆలూ కూర, పైన కరకరలాడే శనగపిండి కోటింగ్.. తలుచుకుంటేనే నోరూరిపోతుంది.
అయితే ఈ రోజుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడం వల్ల చాలామంది నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉంటున్నారు. బ్రెడ్ పకోరా అనగానే అది పీల్చే నూనె గుర్తుకు వచ్చి, తినాలన్న కోరికను చంపుకుంటారు. కానీ ఇకపై మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. రుచిలో ఏమాత్రం రాజీ పడకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నూనె లేని బ్రెడ్ పకోరా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బ్రెడ్ ముక్కలు: 4-6
బంగాళాదుంపలు: 2
శనగపిండి: 1 కప్పు
పచ్చిమిర్చి: 2
అల్లం: చిన్న ముక్క
కొత్తిమీర: గుప్పెడు
ఉప్పు: రుచికి సరిపడా
కారం: సరిపడా
పసుపు: సరిపడా
గరం మసాలా: సరిపడా
ఆమ్చూర్ పౌడర్: సరిపడా
వాము: కొద్దిగా
తయారీ విధానం
-బ్రెడ్ పకోరాలో అసలైన రుచి అందులో పెట్టే స్టఫింగ్ లోనే ఉంటుంది. కాబట్టి స్టఫింగ్ కోసం ముందుగా బంగాళాదుంపలను మెత్తగా ఉడికించి తొక్క తీసి ఒక గిన్నెలో మెత్తగా చిదుముకోవాలి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం తురుము, కొత్తిమీర,ఉప్పు, కారం, చిటికెడు పసుపు, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం మరీ పొడిగా కాకుండా, మరీ జారుగా కాకుండా ముద్దలా ఉండేలా చూసుకోండి.
-ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో శనగపిండిని వేసి ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. పిండి మరీ నీళ్ళలా కాకుండా, మరీ గట్టిగా కాకుండా బ్రెడ్ కి అంటుకునేలా ఉండాలి . ఇందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా వాము నలిపి వేసుకొని కలపాలి.
-ఇప్పుడు రెండు బ్రెడ్ ముక్కలను తీసుకుని, ఒకదానిపై ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని సమానంగా పరచాలి. రెండో బ్రెడ్ ముక్కతో దానిని మూసివేయాలి (సాండ్ విచ్ లాగా). దీనిని త్రిభుజాకారంలో లేదా మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోండి.
-ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కను శనగపిండి మిశ్రమంలో అన్ని వైపులా తడిసేలా జాగ్రత్తగా ముంచండి.
-ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ పెనం వేడి చేసి, దానిపై శనగపిండిలో ముంచిన బ్రెడ్ ను పెట్టండి. మంటను సిమ్ లో ఉంచి, రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి.
-కావాలంటే బ్రెడ్ ముక్కలను ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ లో పెట్టి, 180 డిగ్రీల వద్ద 10-15 నిమిషాలు లేదా క్రిస్పీగా అయ్యేవరకు ఫ్రై చేయండి. ఇది పూర్తిగా ఆయిల్ ఫ్రీ అనుభూతిని ఇస్తుంది.
-ఓవెన్ లో అయితే బేకింగ్ ట్రేలో పెట్టి, బ్రెడ్ క్రిస్పీగా మారే వరకు బేక్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












