Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఉల్లిపాయలను ఇలా కట్ చేస్తే.. కన్నీళ్లు రమ్మన్నా రావు! ఓ సారి ట్రై చేయండి!
వంటలు చేయాలంటే కచ్చితంగా కూరగాయలు కట్ చేయాల్సిందే. ఎలాంటి కూరగాయలు కట్ చేసినా సమస్య లేదు కానీ.. ఉల్లిపాయ కట్ చేస్తే కంట్లో నుంచి కన్నీరు వేరులై పారాల్సిందే. ఎదో దుఃఖం వచ్చినట్లు ఫలాఫలా ఏడ్చేస్తుంటారు. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఉల్లిపాయలు కట్ చేయాలంటే భయపడుతుంటారు. అయితే ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఈ ట్రిక్స్ పాటిస్తే కన్నీళ్లు రాకుండా కట్ చేయొచ్చు. ఆ ట్రిక్స్ ఏంటంటే?
పొట్టు తీసి కట్ చేయాలి..
ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలకు పొట్టు తీసేయాలి. అలాగే పొట్టు తీసిన ఆ ఉల్లిపాయలను ఒక అరగంట పాటు నీళ్లలో నానబెట్టాలి. అలా నానబెట్టిన తరువాత ఆ ఉల్లిపాయలను కట్ చేస్తే కన్నీళ్లు రావు. ఉల్లి ఘాటు కూడా కళ్ళకు తగలవు. దీంతో మనం ప్రశాంతంగా, కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలను కట్ చేసుకోవచ్చు. అలాగే చిరాకు లేకుండా వంట చేసుకోవచ్చు.

నాడలు చేయకుండా
ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఇంకో టిప్ కూడా ఉంది. సాధారణంగా ఉల్లిపాయలను వెనుక, ముందు నాడలు కట్ చేసుకొని తరువాత ఉల్లిపాయలను కట్ చేస్తుంటాము. అలా చేయడం వల్ల కన్నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఉల్లిపాయలు కట్ చేసే ముందు ఉల్లిపాయ పొట్టు తీసేసి, నాడలు కట్ చేయకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. అలా ఒక అరగంట ఫ్రిడ్జ్‌లో పెట్టి తరువాత కట్ చేస్తే కన్నీళ్లు రమ్మన్నా రావు. ప్రశాంతంగా ఎలాంటి హేజిటేషన్ లేకుండా ఉల్లిపాయలను కట్ చేసుకోవచ్చు.
ఈ రెండు టిప్స్ పాటించడం వల్ల ఉల్లిపాయలను కన్నీళ్లు పెట్టుకోకుండా కట్ చేసుకోవచ్చు. అలాగే వంటను కూడా క్షణాల్లో చేసేయొచ్చు. వంట గదిలో ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ టిప్స్‌ను మీ ఫ్రెండ్స్‌కు లేదా వంట ఎక్కువగా చేసే వ్యక్తికి షేర్ చేయండి. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండేందుకు సహాయపడండి.
ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కన్నీళ్లు ఎందుకు వస్తాయంటే
సాధారణంగా ఎవరికైనా ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కన్నీళ్లు వస్తాయి. ఎందుకంటే ఉల్లిపాయల్లో సెల్ఫీనిక్ యాసిడ్ ఉంటుంది. ఉల్లిపాయలను కట్ చేసినప్పుడు దాని నుంచి నీరు ఆ రసాయనం విడుదలై గాలితో కలిసి మన కళ్ళను తాకుతుంది. అది మన కంట్లో నీరు ఉత్పత్తి చేసే గ్రంథులను ప్రేరేపిస్తుంది. దీంతో కన్నీళ్లు వస్తుంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications