Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పప్పు అంటే ముఖం తిప్పుకునే వారు కూడా.. లొట్టలేసుకుని తినే షాహీ మొఘలాయ్ పెసరపప్పు
ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. అందుకే పెసరపప్పుతో చేసిన కూరలు, పెసరట్టు లాంటివి చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ, రోజూ తినే మామూలు పప్పు అనగానే ఇంట్లో వాళ్లంతా ముఖం చిట్లిస్తుంటారు. కందిపప్పుతో పోలిస్తే పెసరపప్పు రుచి కాస్త భిన్నంగా ఉండటమే అందుకు కారణం. అయితే పప్పు అంటే బోర్ కొట్టేవాళ్లకు కూడా లొట్టలేసుకుంటూ తినేలా చేసే ఒక అద్భుతమైన వంటకం..షాహీ మొఘలాయ్ పెసరపప్పు(మొఘలాయ్ మూంగ్ దాల్). పేరులోనే రాజసం ఉన్న ఈ వంటకం రుచిలోనూ అమోఘంగా ఉంటుంది.

షాహీ మొఘలాయ్ పెసరపప్పు తయారీకి కావలసిన పదార్థాలు
పచ్చ పెసలు (పొట్టు తీయనివి) - 1 కప్పు
పచ్చ యాలకులు - 4
నల్ల యాలకులు (పెద్దవి) - 2
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
బగారా ఆకు (బే లీఫ్) - 2
లవంగాలు - 2 లేదా 3
నల్ల మిరియాలు - 3 లేదా 4
ఉప్పు - రుచికి సరిపడా, నీళ్లు - తగినన్ని
నెయ్యి - 2 టీస్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
ఉల్లిపాయలు - 2
వెల్లుల్లి తరుగు - అర టీస్పూన్
అల్లం తరుగు - ఒక అంగుళం ముక్క
పచ్చిమిర్చి - 2
ఇంగువ - చిటికెడు
పసుపు - అర టీస్పూన్
కాశ్మీరీ ఎర్ర కారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
పెరుగు - అర కప్పు
ఫ్రెష్ క్రీమ్ (మీగడ) - 2 లేదా 3 టీస్పూన్లు
వేయించిన కస్తూరి మేతి - అర టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా

షాహీ మొఘలాయ్ పెసరపప్పు తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు పచ్చ పెసలను శుభ్రంగా కడిగి, కనీసం 8 గంటల పాటు నానబెట్టాలి. ఉడకబెట్టే ముందు ఒక చిన్న కాటన్ వస్త్రం తీసుకోండి. అందులో పచ్చి యాలకులు, నల్ల యాలకులు, బగారా ఆకులు, దాల్చినచెక్క, లవంగాలు, మిరియాలు వేసి చిన్న మూటలా గట్టిగా కట్టండి.
-ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో నానబెట్టిన పెసలు, కొద్దిగా ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి.. అందులోనే ఈ మసాలా మూటను కూడా వేయండి. మీడియం మంట మీద మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. పెసలు మెత్తగా ఉడకాలి, కానీ పేస్ట్ లాగా కాకుండా వాటి ఆకారం అలాగే ఉండాలి. ఉడికిన తర్వాత ఆ మసాలా మూటను తీసేయండి.
-స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె, కమ్మటి నెయ్యి వేడి చేయండి. నెయ్యి కరిగాక జీలకర్ర, ఇంగువ వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, అవి బంగారు రంగులోకి మారే వరకు వేయించండి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి.
-ఇప్పుడు మంట తగ్గించి పసుపు, కాశ్మీరీ కారం, ధనియాల పొడి వేసి బాగా కలపండి. మసాలాలు మాడకుండా కొద్దిగా నీళ్లు పోసి 3-4 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు గిలకొట్టిన పెరుగు, తగినంత ఉప్పు వేసి నిరంతరం కలుపుతూ ఉండాలి. గ్రేవీలో నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
-గ్రేవీలో నూనె పైకి తేలుతున్నప్పుడు, ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసలను వేసి కలపండి. పప్పు చిక్కదనాన్ని బట్టి కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. పప్పు గ్రేవీతో కలిసి చక్కగా ఉడుకుతున్నప్పుడు, అందులో ఫ్రెష్ క్రీమ్ (మీగడ), చేత్తో నలిపిన కస్తూరి మేతి వేసి కలపండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేయండి.
-అంతే నోరూరించే షాహీ మొఘలాయ్ పెసరపప్పు రెడీ. దీనిని వేడి వేడి అన్నం, జీరా రైస్, రోటీ లేదా నాన్తో కలిపి వడ్డించండి. పప్పు అంటే ఇష్టపడని వారు కూడా మళ్లీ మళ్లీ అడిగి మరీ తింటారు
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications