Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
డిసెంబర్ 31 పార్టీకి అదిరిపోయే కిక్ ఇచ్చే క్రిస్పీ చికెన్ ఫ్రై రెసిపీ ఇదే
డిసెంబర్ 31 నైట్ అంటేనే సెలబ్రేషన్స్, పార్టీలు, రుచికరమైన ఆహారం. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఈ తరుణంలో..కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడానికి క్రిస్పీ చికెన్ ఫ్రై ఒక అద్భుతమైన ఆప్షన్.
సాధారణంగా మనం రెస్టారెంట్లలో తినే చికెన్ ఫ్రై ఎంతో కరకరలాడుతూ, లోపల జ్యూసీగా ఉంటుంది. ఈ డిసెంబర్ 31 నైట్ పార్టీలోకి అచ్చం రెస్టారెంట్ స్టైల్ లో క్రిస్పీ చికెన్ ఫ్రై ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్ధాలు
-చికెన్
-పచ్చిమిర్చి
-వెల్లుల్లి
-అల్లం
-మిరియాలు
-ధనియాలు
-ఎండుమిర్చి
-పసుపు
-ఉప్పు
-కారం
-జీడిపప్పు
-చింతపండు
-కరివేపాకు
-కొత్తిమీర
-షాజీరా
-మొక్కజొన్న పిండి
-బియ్యం పిండి
-ఆయిల్
తయారీ విధానం
-ముందుగా అర కేజీ చిన్నగా కట్ చేసిన చికెన్ ముక్కలకు ఉప్పు బాగా పట్టించి శుభ్రంగా కడగాలి.
-తర్వాత ఓ బౌల్ లో కడిగిన చికెన్ ముక్కలు, 2 టీస్పూన్ల కారం, సన్నగా తరిగిన కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ కారం, అర చెక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తురుము వేసి మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలిపి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అర టీస్పూన్ మిరియాలు, అర టీస్పూన్ షాజీరా, అర టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ ధనియాలు, 3 యాలకలు, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 5 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల చింతపండు వేసి సన్నని సెగ మీద 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత వాటిని మిక్సీ గిన్నెలో వేసి,ఇందులోనే 15 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కలు, 3 పచ్చిమిరపకాయలను తుంచి వేసి మొత్తాన్ని లైట్ గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని చికెన్ ముక్కల్లో వేసి బాగా కలపాలి. తర్వాత చికెన్ ముక్కల్లోనే అరకప్పు బియ్యం పిండిని, 2 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండిని, 2 టీస్పూన్ల నీళ్లను చల్లుకుంటూ మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మూతపెట్టి కనీసం అరగంట సేపు పక్కన పెట్టుకోండి.
-అరగంట తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసి వేడి చేశాక కొన్ని చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా అందులో వేసి మీడియం మంట మీద వేయించాలి.
-చికెన్ ముక్కలుగా బాగా వేగాక అప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేసి 1 నిమిషం వేయించాక చికెన్ ముక్కలతో పాటు కరివేపాకును కూడా ప్లేట్ లోకి తీసుకోండి.
-ఇలాగే,రెండోసారి మిగిలిన చికెన్ ముక్కలను చికెన్ ముక్కలను బాండీలో వేసి అవి వేగాక 5 చితకొట్టిన వెల్లుల్లి రెబ్బలు, గాట్లు పెట్టిన 4 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసి చికెన్ ముక్కలతో పాటు వీటిని బాగా ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసుకోండి.
-అంతే రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications