Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
నోటికి కమ్మగా, ఒంటికి హాయిగా.. కేరళ,తమిళనాడు స్పెషల్ కొబ్బరి పాల రసం..రుచి అదుర్స్ అంతే!
రసం అనగానే మనందరికీ ముందుగా టమాటా రసం, పప్పు రసం లేదా మిరియాల రసమే గుర్తుకొస్తాయి. మన దక్షిణ భారతీయ భోజనం రసం లేకుండా అసంపూర్ణంగా అనిపిస్తుంది. అయితే, రోజూ ఒకే రకమైన రసం తాగి బోర్ కొట్టిన వారికి, కేరళ,తమిళనాడు తీరప్రాంతాల్లో ఎంతో ఫేమస్ అయిన ఈ కొబ్బరి పాల రసం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.
కొబ్బరి పాలలో ఉండే క్రీమీ టెక్స్చర్, మసాలాల ఘాటు కలగలిసి అన్నంతో అద్భుతమైన రుచిని అందిస్తాయి. ఇది కేవలం అద్భుతమైన రుచిని మాత్రమే కాదు, గొంతు నొప్పికి, పొట్ట ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఎలాంటి స్పెషల్ మసాలా పొడులు లేకుండానే కొబ్బరి పాల రసాన్ని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
టమాటా - 1 లేదా 2
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - కొద్దిగా
చింతపండు రసం - తగినంత
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - 2 కప్పులు
తాజా కొబ్బరి పాలు - 1 కప్పు
కొత్తిమీర - కొద్దిగా
దంచుకోవడానికి: మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు
తాలింపుకి: కొబ్బరి నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు,
ఇంగువ.
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చేతితోనే బాగా మెదపాలి (మాష్ చేయాలి). ఆ తర్వాత ఇందులో తగినంత చింతపండు రసం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి, రెండు కప్పుల నీళ్లు పోసి సుమారు పది నిమిషాల పాటు మీడియం మంటపై మరిగించాలి. దీనివల్ల టమాటా, చింతపండు పచ్చివాసన పోయి రసం మంచి రుచికి వస్తుంది.
-రసం మరుగుతున్నప్పుడు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిని కలిపి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ తాజా మసాలాను మరుగుతున్న రసంలో వేసి మరో నిమిషం పాటు మరిగిస్తే.. రసం ఘుమఘుమలాడుతుంది.
-ఇప్పుడు మంటను సిమ్ లో పెట్టి ముందుగా సిద్ధం చేసుకున్న ఒక కప్పు తాజా కొబ్బరి పాలను పోయాలి. కొబ్బరి పాలు పోసిన తర్వాత రసాన్ని ఎక్కువగా మరిగించకూడదు. రసం సన్నగా మరగడం (బుడగలు రావడం) ప్రారంభించగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. లేదంటే పాలు విరిగిపోతాయి.
-ఇప్పుడు ఒక చిన్న పాన్ లో నూనె వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి చిటపటలాడించి తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపును రసంలో వేసి, పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి మూత పెట్టేయాలి. అంతే కొబ్బరి పాల రసం రెడీ.
-పొగలు కక్కే వేడి వేడి అన్నంలోకి ఈ కొబ్బరి పాల రసాన్ని కలుపుకుని తింటుంటే ఆ మజాయే వేరు. దీనికి తోడుగా కరకరలాడే అప్పడం లేదా ఏదైనా వెజిటేబుల్ ఫ్రై ఉంటే భోజనం రెట్టింపు రుచిని ఇస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications