Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
బరువు తగ్గాలనుకుంటున్నారా? రైస్ కి బదులు ఈ బార్లీ వెజ్ కిచిడీ ట్రై చేయండి!
బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి, డయాబెటిస్ ఉన్నవారికి లేదా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలనుకునే వారికి బార్లీ ఒక వరం లాంటిది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే ప్రతిరోజూ కేవలం బార్లీ నీళ్లు తాగాలంటే కాస్త విసుగు రావచ్చు. అలాంటి వారి కోసమే అద్భుతమైన రెసిపీ.. బార్లీ వెజ్ కిచిడీ. కూరగాయలు, కమ్మటి నెయ్యి, మసాలా దినుసులు కలిపి చేసే ఈ కిచిడీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. సులభంగా జీర్ణమవుతుంది.

బార్లీ కిచిడి తయారీకి కావలసిన పదార్థాలు
బార్లీ గింజలు - ముప్పావు కప్పు
నెయ్యి -అర టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 3
జీలకర్ర - అర టీస్పూన్
ఉల్లిపాయ ముక్కలు - 3 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - రెండు రెమ్మలు
పచ్చిమిర్చి - 1
గరం మసాలా - అర టీస్పూన్
సాంబార్ పొడి - అర టీస్పూన్
క్యారెట్, బీన్స్, బఠానీ- మీకు నచ్చినవి తగినన్ని
ఎడామామె (సోయా చిక్కుళ్ళు) - పావు కప్పు
పసుపు - పావు టీస్పూన్
మిరియాల పొడి - రుచికి సరిపడా
ఉప్పు - తగినంత
నీళ్లు - బార్లీకి 5 లేదా 6 రెట్లు
కొత్తిమీర - కొద్దిగా
బార్లీ కిచిడీ తయారీ విధానం
-ముందుగా బార్లీ గింజలను శుభ్రంగా కడిగి, రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయం వండే ముందు ఆ నీటిని పూర్తిగా వంపేయాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని, అందులో నెయ్యి వేడి చేయండి. నెయ్యి కరిగాక జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉల్లిపాయలు లేత గులాబీ రంగులోకి మారే వరకు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన కూరగాయల ముక్కలు, ఎడామామె గింజలను వేసి ఒక నిమిషం పాటు నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా, సాంబార్ పొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరో నిమిషం పాటు కలపాలి. ఇలా చేయడం వల్ల మసాలాల ఫ్లేవర్ కూరగాయలకు బాగా పడుతుంది.
-ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బార్లీ గింజలను కుక్కర్ లో వేయాలి. కిచిడీ చక్కగా ఉడకడానికి బార్లీకి 5 నుంచి 6 రెట్లు నీళ్లు పోసి, ఒక ఉడుకు రానివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కొద్దిగా మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. కుక్కర్ మూతపెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-ప్రెషర్ దానంతట అదే పోయిన తర్వాత మూత తీయాలి. కిచిడీ మరీ గట్టిగా అనిపిస్తే, అందులో మరో ముప్పావు కప్పు నీళ్లు పోసి మీకు కావాల్సిన చిక్కదనం వచ్చేలా అడ్జస్ట్ చేసుకుని, సన్నటి మంటపై మరో 2 నిమిషాలు ఉడికించాలి.
-అంతే గుమగుమలాడే వేడి వేడి బార్లీ వెజ్ కిచిడీ రెడీ.
-దీనిని మామిడికాయ తొక్కు, నిమ్మకాయ పచ్చడి, చల్లటి పెరుగు లేదా మీకు ఇష్టమైన ఏదైనా వెజిటబుల్ కర్రీతో కలిపి తింటే ఆ రుచే వేరు. డైట్లో ఉన్నవారు రైస్‌కు ప్రత్యామ్నాయంగా ఈ కిచిడీని తమ మెనూలో చేర్చుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications