Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే మ్యాంగో బర్ఫీ..కోవా అక్కర్లేకుండానే ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
మామిడి పండును ముక్కలుగా కోసుకుని తినడమే కాకుండా, వాటితో ఎన్నో రకాల కమ్మటి వంటకాలు తయారు చేసుకోవచ్చు. సాధారణంగా వేసవిలో మనం ఇంట్లో మామిడి పండ్లతో జ్యూస్, మిల్క్ షేక్ లేదా ఐస్ క్రీమ్ వంటివి చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మ్యాంగో బర్ఫీ గురించి విన్నారా? అద్భుతమైన రుచితో, నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే మామిడి బర్ఫీ కోవా అవసరం లేకుండానే ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

మ్యాంగో బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు
మామిడి పండు గుజ్జు - 1 కప్పు
పాలు - అర కప్పు
శనగపిండి (లేదా గోధుమ పిండి) - అర కప్పు
పంచదార - 1 కప్పు
నెయ్యి - అర కప్పు
యాలకులు - 3 లేదా 4
బొంబాయి రవ్వ (సూజీ) - 1 లేదా 2 టేబుల్ స్పూన్లు
తరిగిన పిస్తా- అలంకరణ కోసం
మ్యాంగో బర్ఫీ తయారీ విధానం
-ముందుగా బాగా పండిన, తీయగా ఉండే మామిడి పండును ఎంచుకోవాలి. పుల్లటి కాయ అయితే బర్ఫీ రుచి మారిపోతుంది. మామిడికాయను శుభ్రంగా కడిగి, లోపలి గుజ్జును తీసుకోవాలి.
-ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు మామిడి గుజ్జు, అర కప్పు పాలు జత చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఒక వెడల్పాటి గిన్నెలో అర కప్పు శనగపిండి వేయాలి. శనగపిండికి బదులుగా గోధుమ పిండిని కూడా వాడొచ్చు. ఈ శనగపిండిలో మిక్సీ పట్టుకున్న మామిడి గుజ్జును వేసి, ఎక్కడా చిన్న ఉండలు లేకుండా చాలా మృదువుగా కలపాలి.
-స్టవ్ మీద మందపాటి అడుగు ఉన్న ఒక నాన్ స్టిక్ పాన్ లేదా కడాయి పెట్టి అందులో అర కప్పు నెయ్యి వేసి వేడి చేశాక అందులో ముందుగా కలిపి పెట్టుకున్న పిండి-మామిడి మిశ్రమాన్ని వేసి తక్కువ మంట మీద అడుగు మాడకుండా గరిటెతో కలుపుతూనే వేయించాలి.
-పిండి పచ్చివాసన పోయేలా కొద్దిసేపు వేయించిన తర్వాత ఆ మిశ్రమంలో 1-2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసి కలపాలి. మిశ్రమం కాస్త దగ్గరపడి, పొడిగా మారుతున్న సమయంలో ఒక కప్పు పంచదారలో యాలకులు వేసి మెత్తగా పొడి చేసి, ఆ పొడిని పాన్ లో వేసి బాగా కలపాలి.
-పంచదార కరిగి మిశ్రమం అంతా దగ్గరపడి, పాన్ నుండి నెయ్యి వదులుతూ, ఒక ముద్దలాగా మారుతుంది. సుమారు 4-5 నిమిషాల పాటు ఇలా ఉడికించాక స్టవ్ ఆపేయండి. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకుని, దానికి కొద్దిగా నెయ్యి రాసి, ఈ వేడి మిశ్రమాన్ని సమానంగా స్ప్రెడ్ చేయండి. పైన సన్నగా తరిగిన పిస్తా పప్పులను చల్లి, కాస్త నొక్కండి.
-దీనిని 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసి గట్టిపడనివ్వాలి. ఆ తర్వాతమీకు నచ్చిన షేపులో ముక్కలుగా కట్ చేసుకోండి.
-అంతే ఎంతో కమ్మని మ్యాంగో బర్ఫీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications