Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
రైస్,రోటీ,పూరీ దేనితో అయినా అద్దిరిపోయే మిల్మేకర్ కుర్మా..దీని ముందు మాంసం కూడా జుజుబి..ఎలా చేసుకోవాలంటే
మీల్ మేకర్ (సోయా చంక్స్) అనేది సోయాబీన్స్ నుండి తయారైన ఒక అద్భుతమైన ఆహార పదార్ధం. ఇది మాంసానికి ఒక అద్భుతమైన శాకాహార ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మనదేశంలో ముఖ్యంగా శాఖాహారులలో ఇది చాలా ప్రసిద్ధి చెందింది. మీల్మేకర్ కుర్మా అనేది సుగంధ ద్రవ్యాలు, క్రీమీ గ్రేవీతో కూడిన ఒక రుచికరమైన వంటకం. ఇది అన్నం, రోటీ, నాన్ లేదా పరాఠాతో సంపూర్ణ భోజనంగా ఆస్వాదించవచ్చు. ఈ వంటకం రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీనిని తయారుచేయడానికి కూడా ఎక్కువ సమం పట్టదు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారుచేసుకునే వంటకం ఇది. మీల్మేకర్ కుర్మా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
మీల్మేకర్ కుర్మా తయారీకి కావాల్సిన
పదార్థాలు
-మీల్మేకర్ లేదా సోయా చంక్స్
-ఉల్లిపాయ
-టమాటో
-పచ్చిమిర్చి
-పసుపు
-అల్లం
-కరివేపాకు
-లవంగాలు
-యాలకలు
-దాల్చిన చెక్క
-వెల్లుల్లి
-బిర్యానీ ఆకు
-మిరియాలు
-ఉప్పు
-ఆయిల్
-కసూరి మేథీ
-కొత్తిమీర తరుగు
-కారం
-ధనియాల పొడి
-గరం మసాలా
-పెరుగు
మీల్మేకర్ కుర్మా తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో 1కప్పు మిల్మేకర్(సోయా చంక్స్ )వేసి అవి మునిగేంత నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి పావుగంట సేపు నాననివ్వాలి.
-తర్వాత మసాలా పేస్ట్ కోసం మిక్సీ గిన్నెలో అర టీస్పూన్ మిరియాలు,1 ఇంచు అల్లం, 2 ఉల్లిపాయ ముక్కలు,4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకలు,7 వెల్లుల్లి, సగం బిర్యానీ ఆకు, 3 పచ్చిమిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకోండి.
-తర్వాత పావు గంట సేపు నానిన మీల్మేకర్ నుంచి నీరు పిండేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ ఆయిల్ వేడి చేసి ఇందులో నీరు పిండేసిన మీల్మేకర్, కొద్దిగా పసుపు వేసి 1 నిమిషం వేయించి పక్కన పెట్టుకోండి.
-తర్వాత అదే పాన్ లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి రెండు పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు, రెండు యాలకలు, ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసి వేయించాలి.
-ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి ఉంచిన పేస్ట్ ను వేసి బాగా కలపండి. మీడియం మంట మీద నూనె పైకి తేలేంతవరకు వేపుకోండి. మసాలాలు వేగితే కూర చేదువస్తుంది కాబట్టి మాడిపోకుండా చూసుకోండి.
-మసాలా పేస్ట్ మంచిగా వేగాక అందులో 2 టమాటోల పేస్ట్ వేసి కలిపి మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనివ్వాలి.
-తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ గరం మసాలా, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి వేపండి.ఆయిల్ పైకి తేలే సమయంలో వేయించిన మీల్మేకర్ వేసి, 1 కప్పు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి మీడియం మంట మీద 7-8నిమిషాలు ఉడికించాలి.
-ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో బాగా చిలికిన అరకప్పు పెరుగు పోసి తక్కువ మంటమీద కూరలో కలిసిపోయేంత వరకు బాగా కలపి మూతపెట్టి 5 నిమిషాలు వదిలేయండి.
-చివరిగా 1 టీస్పూన్ కసూరి మేథీ నలిపి వేయండి.కొత్తిమీర తరుగు కూడా వేసి కలిపి 1 నిమిషం తర్వాత దించేయండి. అంతే టేస్టీ మీల్మేకర్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







