దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు

Posted By:

నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడే వంటకాల్లో చికెన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటది. చికెన్ తో ఎన్ని రకాల వంటకాలు చేసినా ఎన్నిసార్లు తిన్నా మళ్లీ మళ్లీ తినాలనిపించేది మాత్రం బట్టర్ చికెన్ వంటకమే. అసలు బట్టర్ చికెన్ అనే పేరు వింటేనే చాలామంది నోళ్లల్లో లాలాజలం ఊరుతుంది. ఒక్కసారి తింటే మనసు అస్సలు ఊరుకోదు..మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది. మనందరి ఫేవరెట్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ అయితే ఒక ఇంటర్యూలో తన ఫేవరెట్ చికెన్ వంటకం బటర్ చికెన్ అని చెప్పాడు.

ఈసారి మీ ఇంట్లో చికెన్ తెచ్చుకున్నప్పుడు దానితో బట్టర్ చికెన్ ట్రై చేసి చూడండి..ఎన్నిసార్లు ఇక ఇంటికి చికెన్ తెచ్చినా అలానే చేయాలంటారు. చపాతీ, రోటీ, బిర్యానీలోకి దీన్ని కలుపుకుని తింటుంటే అద్దిరిపోతుంది. దాబా స్టైల్ బట్టర్ చికెన్ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Dhaba Style Butter Chicken Recipe in Telugu Make Weekend Special With This Chicken Recipe

బట్టర్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు

చికెన్ మ్యారినేషన్ కోసం:

చికెన్-అర కేజీ
ఉప్పు-అర టీస్పూన్
పసుపు-పావు టీస్పూన్
కారం- 1 టీస్పూన్
గరం మసాలా పొడి-అర టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
నిమ్మరసం-కొద్దిగా
పెరుగు-పావు కప్పు

గ్రేవీ, వంటకానికి:

బట్టర్(వెన్న)-3 టేబుల్ స్పూన్లు
ఆయిల్-2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ-2
టమాటో-3
పచ్చిమిర్చి-2
వెల్లుల్లి రెబ్బలు-8
అల్లం-1 ఇంచు
జీడిపప్పు-20
ఫ్రెష్ క్రీమ్-3 టేబుల్ స్పూన్లు
కసూరి మేథీ- అర టేబుల్ స్పూన్
కొత్తిమీర- కొద్దిగా
ఉప్పు- అర టేబుల్ స్పూన్
పసుపు- పావు టీస్పూన్
కారం-1 టేబుల్ స్పూన్
ధనియా,జీలకర్ర పొడి- 1 టేబుల్ స్పూన్
గరం మసాలా పొడి- అర టేబుల్ స్పూన్

గరం మసాలా దినుసులు:
బిర్యానీ ఆకు-1
షాజీరా-అర టీస్పూన్
పచ్చ యాలకలు-2
నల్ల యాలక-1
లవంగాలు-3
దాల్చిన చెక్క-1 ఇంచు
జాపత్రి-కొద్దిగా
స్టార్ అనాస-అర ముక్క

నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం!

బట్టర్ చికెన్ తయారీ విధానం

-ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు. గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం వేసి మొత్తం బాగా కలిసేలా చేతులతో కలుపుకోవాలి. తర్వాత మూతపెట్టి 1 గంట సేపు పక్కన పెట్టుకోండి.

-1 గంట తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. అందులో బట్టర్(వెన్న), ఆయిల్ వేసి వేడయ్యాక అందులో చికెన్ ముక్కలు వేసి 80 శాతం ఉడికేవరకు ఫ్రై చేశాక వాటిని తీసి ప్లేట్ లో పెట్టుకోండి.

-ఇప్పుడు అదే పాన్ లో కొంచెం బట్టర్ వేసి కరిగాక మసాలు దినుసులు, జీడిపప్పు వేసి వేయంచాక అందులోనే ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇవి వేగాక అందులోనే టమాటో ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి.

-టమాటో ముక్కలు మగ్గిన తర్వాత మూత తీసి అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలిపాక స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారాక ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొంచెం బట్టర్ వేసి అందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి ఆయిల్ సపరేట్ అయ్యేవరకు ఉడికించాక అందులో ఫ్రై చేసిన చికెన్ ముక్కలు, తగినన్ని నీళ్లు పోసి కలిపి మూతపెట్టి 2 నిమిషాలు ఉడికించి చివరగా అందులో కసూరి మేథీ, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేయండి.

-అంతే బట్టర్ చికెన్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, October 17, 2026, 16:20 [IST]
Desktop Bottom Promotion