Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ధాబా స్టైల్ కర్డ్ చికెన్..ఒక్కసారి తింటే ఇకపై ఎప్పుడూ ఇలాగే వండుతారు!..బిర్యానీ,చపాతీ,పూరీ దేనిలోకైనా కేక
ప్రతిసారీ వండే ఒకేలాంటి రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? ఈసారి ఏదైనా కొత్తగా, అద్భుతంగా ట్రై చేయాలనుకుంటే.. కర్డ్ చికెన్ గ్రేవీ (పెరుగు చికెన్)తప్పక ప్రయత్నించండి.
ఇది కేవలం పూరీ, చపాతీ, రోటీల్లోకే కాదు..వేడి అన్నం, బిర్యానీ లేదా పులావ్ లో కలుపుకుని తిన్నా అమృతంలా ఉంటుంది. ధాబా స్టైల్ లో కర్డ్ చికెన్ గ్రేవీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
ఉల్లిపాయలు - 2 పెద్దవి
పచ్చిమిర్చి - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
కమ్మటి పెరుగు - 1 కప్పు
జీలకర్ర పొడి - 1 టేబుల్ స్పూన్
కారం - 1 టీస్పూన్
గరం మసాలా పొడి - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
చికెన్ - అర కిలో
పసుపు - 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు పెరుగు తీసుకుని, ఉండలు లేకుండా క్రీమ్ లాగా బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కాక శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలపండి. ఆ తర్వాత పసుపు, ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెద్ద మంట మీద చికెన్ ను బాగా వేయించండి. ముక్కలు అన్ని వైపులా పచ్చి వాసన పోయి, చక్కగా వేగేలా సుమారు 10 నిమిషాల పాటు ఫ్రై చేసి వాటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో అవసరమైతే కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి దాల్చిన చెక్క, జీలకర్ర వేసి చిటపటలాడించండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు రంగు వచ్చేవరకు వేయించాక అందులోనే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించండి.
-ఇప్పుడు పాన్ లో కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి మసాలాలన్నీ ఉల్లిపాయలకు పట్టేలా బాగా కలుపుకోవాలి.
-మసాలా దినుసుల పచ్చి వాసన పోయి, నూనె పైకి తేలుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసి మసాలాతో బాగా కలపాలి.
-మంటను సిమ్ లో పెట్టి ముందుగా గిలకొట్టి పెట్టుకున్న పెరుగును వేసి కలుపుకోవాలి. గ్రేవీ బాగా కలిశాక మూత పెట్టి చికెన్ మెత్తగా ఉడికేలా సన్నని మంటపై ఉడికించండి.
-గ్రేవీ దగ్గరపడి, నూనె పైకి తేలుతున్నప్పుడు కసూరీ మేతీ,కొత్తిమీర చల్లుకుంటే పెరుగు చికెన్ గ్రేవీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications