Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
స్మోకీ ఫ్లేవర్ తో అసలైన ధాబా స్టైల్ పనీర్ హైదరాబాదీ..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
హైదరాబాదీ వంటకాలు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి బిర్యానీ, హలీమ్ వంటి ఘుమఘుమలాడే వంటకాలు. ఆ కోవకే చెందింది పనీర్ హైదరాబాదీ. ఇది పనీర్ తో చేసే ఒక అద్భుతమైన, రిచ్ గ్రేవీ కర్రీ. ముఖ్యంగా ధాబాలలో దీనిని తయారుచేసే విధానం విభిన్నంగా ఉంటుంది. ఈ రెసిపీని ఇంట్లోనే సులభంగా, ధాబా స్టైల్ లో ఎలా చేసుకోవాలో చూడండి.
కావాల్సిన పదార్థాలు
తాజా పాలకూర- 2 కట్టలు
కొత్తిమీర- 1 కట్ట
పుదీనా ఆకులు- అర కట్ట
పచ్చిమిర్చి- 5-6
జీడిపప్పు- 10-12
అల్లం- 1 అంగుళం ముక్క
వెల్లుల్లి- 6-7
పనీర్- 250 గ్రాములు
ఉప్పు- చిటికెడు
పసుపు- పావు టీస్పూన్
కారం- అర టీస్పూన్
నూనె- 1 టేబుల్ స్పూన్ వేయించడానికి
షాజీరా- 1 టీస్పూన్
బిర్యానీ ఆకు- 1
యాలకులు- 2
లవంగాలు - 3
దాల్చిన చెక్క- 1 చిన్న ముక్క
ఉల్లిపాయలు- 2
టొమాటోలు- 2
పసుపు - అర టీస్పూన్
ధనియాల పొడి- 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి- 1 టీస్పూన్
గరం మసాలా- 1 టీస్పూన్
చిక్కటి పెరుగు- 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు- రుచికి సరిపడా
ఫ్రెష్ క్రీమ్- 2 టేబుల్ స్పూన్లు
కసూరి మేతి - 1 టీస్పూన్
నూనె లేదా నెయ్యి- 3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు చక్కెర వేయాలి.
-ఇప్పుడు అందులో పాలకూర ఆకులను వేసి కేవలం 2 నిమిషాలు ఉంచి వెంటనే తీసి చల్లటి నీటిలో వేయాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో పాలకూర, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నానబెట్టిన జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో పనీర్ ముక్కలను తీసుకుని వాటిపై ఉప్పు, పసుపు, కారం చల్లి నెమ్మదిగా కలపాలి. ఒక పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి పనీర్ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు అన్ని వైపులా లైట్ గా వేయించుకోవాలి. వేయించిన పనీర్ ముక్కలను ఒక గిన్నె గోరువెచ్చని నీటిలో వేసి ఉంచితే అవి గట్టిపడకుండా మెత్తగా ఉంటాయి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక లోతైన కడాయి పెట్టి అందులో నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. నూనె వేడెక్కాక షాజీరా, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి చిటపటలాడనివ్వాలి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు గోధుమ రంగులోకి వచ్చేవరకు మీడియం మంటపై బాగా వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టొమాటో ముక్కలు వేసి టొమాటోలు మెత్తబడి నూనె పైకి తేలేంత వరకు మగ్గించాలి.

-ఇప్పుడు మంటను తగ్గించి పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
-తర్వాత అందులో గిలకొట్టిన పెరుగు వేసి ఉండలు కట్టకుండా వేగంగా కలపాలి. పెరుగు నుండి నూనె వేరుపడే వరకు ఉడికించాలి.
-ఇప్పుడు అందులో ముందుగా సిద్ధం చేసుకున్న గ్రీన్ పేస్ట్ వేసి, రుచికి సరిపడా ఉప్పు కలపాలి. ఈ పేస్ట్ పచ్చి వాసన పోయి, నూనె పైకి తేలే వరకు 5-7 నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి.
-గ్రేవీ చిక్కగా అనిపిస్తే అర కప్పు వేడి నీళ్లు లేదా పాలు పోసి కావలసిన కన్సిస్టెన్సీకి సర్దుబాటు చేసుకోవాలి.
-ఇప్పుడు వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కలను నీటిలో నుండి తీసి గ్రేవీలో వేయాలి. నెమ్మదిగా కలిపి మూతపెట్టి 5 నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడకనివ్వాలి.
-చివరగా, గరం మసాలా, నలిపిన కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
-ఇప్పుడు ఒక చిన్న స్టీల్ గిన్నెలో బొగ్గు ముక్కను కాల్చి, కర్రీ మధ్యలో పెట్టాలి. దానిపై కొద్దిగా నెయ్యి వేసి, వెంటనే మూత పెట్టాలి. 2-3 నిమిషాల తర్వాత ఆ గిన్నెను తీసేస్తే కూరకు అద్భుతమైన స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అంతే ఘుమఘుమలాడే ధాబా స్టైల్ పనీర్ హైదరాబాదీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications