Latest Updates
-
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం.. -
చేతి గోళ్లు ఇలా ఉంటే కిడ్నీల ఆరోగ్యానికి వార్నింగ్.. మీకూ ఇలా ఉందా.? -
ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా.. -
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.! -
కుజ- చంద్రుల కలయికతో మహాలక్ష్మి రాజయోగం.. ఎనలేని సంపద సిద్ధించే ఈ రాశుల్లో మీరు ఉన్నారా.!
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు!
మీరు ఇప్పటిదాకా అనేక రకాల వెజిటేబుల్ బిర్యానీలు రుచి చూసి ఉంటారు. అయితే ప్రతేకమైన మసాలాతో అచ్చమైన దిండిగల్ స్టైల్ వెజిటేబుల్ బిర్యానీ ఒకసారి తింటే మిగతా వెజ్ బిర్యానీలన్నీ మర్చిపోవాల్సిందే. అంత రుచిగా ఉంటుంది. సాధారణ బాస్మతి బియ్యంతో కాకుండా.. సువాసనలు వెదజల్లే సాంప్రదాయక జీరక సాంబ బియ్యం, అలాగే ప్రత్యేకంగా ఇంట్లోనే తయారు చేసుకున 'సీక్రెట్ మసాలా పొడి'తో ఈ బిర్యానీ చేస్తే ప్రతి మెతుకూ ఘుమఘుమలాడుతూ అమృతంలా ఉంటుంది.

దిండిగల్ వెజ్ బిర్యానీ తయారీకి కావాల్సినవి
మసాలా పేస్ట్ తయారీకి
చిన్న ఉల్లిపాయలు (సాంబార్ ఉల్లిపాయలు) - 300 గ్రా.
అల్లం - 100 గ్రా.
వెల్లుల్లి - 100 గ్రా.
పచ్చిమిర్చి - 5
సీక్రెట్ బిర్యానీ మసాలా పొడి తయారీకి
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
యాలకులు - 4
లవంగాలు - 4
అనాస పువ్వు - 1
జాపత్రి - 1
రాతి పువ్వు - 1 చిన్న ముక్క
బిర్యానీ ఆకు - 1
మరాఠీ మొగ్గ - 1
జాజికాయ - ¼ వంతు
సోంపు - ½ టీస్పూన్
జీలకర్ర - ½ టీస్పూన్
మిరియాలు - ½ టీస్పూన్
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
గసగసాలు - 1 టీస్పూన్
జీడిపప్పు - 10
దిండిగల్ వెజ్ బిర్యానీ తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ గిన్నెలో సాంబార్ ఉల్లిపాయలు, అల్లం,వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో దాల్చిన చెక్క,యాలకులు,లవంగాలు,అనాస పువ్వు,జాపత్రి,రాతి పువ్వు,చిన్న ముక్క,బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ,జాజికాయ,సోంపు,జీలకర్ర,మిరియాలు, ధనియాలు,గసగసాలు, జీడిపప్పు వేసి దోరగా సువాసన వచ్చేదాకా వేయించాలి . ఆ తర్వాత చల్లార్చి మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే బిర్యానీ రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పౌడర్.
-ఇప్పుడు మిక్స్ డ్ వెజిటేబుల్స్ 1 కేజీ (క్యారెట్, బీన్స్, బంగాళదుంప, క్యాలీఫ్లవర్, పచ్చి బఠానీలు) మీడియం సైజులో కట్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో 200 ml నూనె, 50 గ్రాముల నెయ్యి వేడి చేయాలి. అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న ఉల్లి-అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి, నూనె పైకి తేలేంతవరకు వేయించాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న 'సీక్రెట్ మసాలా పొడి 1 టేబుల్ స్పూన్ వేసి కలపాలి. ఆ తర్వాత అర టీస్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ కారం, 200 ml పెరుగు వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు కట్ చేసుకున్న 1 కేజీ కూరగాయల ముక్కలు, తగినంత ఉప్పు, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసి ముక్కలను మసాలాలో బాగా మగ్గనివ్వాలి.
-1 కేజీ జీరక సాంబ బియ్యానికి కచ్చితంగా 2 లీటర్ల నీరు (1:2 నిష్పత్తి) పోయాలి. నీరు బాగా మరిగాక.. ముందుగా కడిగి పెట్టుకున్న 1 కేజీ జీరక సాంబ బియ్యాన్ని అందులో వేయాలి.
-బియ్యం ఉడికి, నీరు కాస్త దగ్గర పడ్డాక మంట తగ్గించి అన్నాన్ని గరిటతో సమానంగా సర్దాలి. పైన 50 ml కరిగించిన నెయ్యిని చుట్టూరా వేయాలి. గుప్పెడు పుదీనా పైన చల్లాలి.
-ఇప్పుడు గిన్నె అడుగు అంటకుండా ఉండేందుకు కింద ఒక పాత పెనం పెట్టి, గిన్నెపై మూతపెట్టి బరువు ఉంచాలి. సన్నని మంటపై అన్నం పర్ఫెక్ట్ గా ఉడికే వరకు దమ్ చేయాలి.
-అంతే మూత తీయగానే ఇల్లంతా సువాసనలు నింపే దిండిగల్ వెజ్ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications