Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Chapati: చపాతీలు మెల్లెపువ్వులాగా మెత్తగా రావాలా?.. అయితే ఈ టిప్స్ పాటించండి!
చాలా మంది ప్రతిరోజూ చపాతీలు చేస్తుంటారు. అయితే ఆ చపాతీలు ఎంత చేసినా ఎలాంటి పదార్థాలు వాడినా అవి మెత్తగా రావు. అలాగే పొంగవు కూడా. అయితే చపాతీలు మెత్తగా రావాలన్నా, మంచిగా పొంగాలన్నా కచ్చితంగా ఈ టిప్స్ పాటించాలి. ఈ టిప్స్ పాటించకుండా మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా చపాతీ మెత్తగా రాదు. అలాగే మీ ప్రయత్నం విఫలమవుతూ ఉంటుంది. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పెద్ద గిన్నె..
చపాతీలు చేసే మహిళలు మొట్టమొదటిగా చేసే అతిపెద్ద సమస్య ఇదే. చపాతీ పిండిని కలిపేటప్పుడు చిన్న పాత్రలో కలుపుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల పిండి సరిగ్గా కలవదు, సరిగ్గా మెత్తగా రాదు. అందుకే పిండిని కలుపుకోవడానికి పెద్ద పాత్రను ఎంచుకోవాలి. కొంచెం వెడల్పుగా, సులభంగా చేయి తిరిగే విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే పిండి బాగా కలుస్తుంది. చపాతీలు వేసుకున్నప్పుడు కూడా మెత్తగా వస్తాయి.

వేడి నీటితో..
చాలా మంది చపాతీ పిండిని కలుపుకునేటప్పుడు చల్లని నీళ్లను వాడుతుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో నీళ్లు ఎక్కువగా లేదా తక్కువగా అవుతుంటాయి. దీని కారణంగా చపాతీలు మెత్తగా రావు. అందుకే చపాతీ పిండిని కలిపేటప్పుడు కచ్చితంగా గోరువెచ్చని నీటిని ఉపయోగించడం. ఇలా చేయడం వల్ల చపాతీ పిండి సరిగ్గా కలపడంతో పాటు చపాతీలు కూడా మంచిగా అవుతాయి.
మళ్ళీ ఓసారి కలుపుకోవాలి
సాధారణంగా చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం నీరు ఎక్కువగా అయినట్లు అనిపిస్తే చాలా మంది మరింత గోధుమ పిండిని కలుపుకుంటారు. ఇలా చేయడం వల్ల చపాతీలు మెత్తగా రావు. పైగా మరింత గట్టిగా తయారవుతాయి. ఇలాంటి సందర్భాల్లో చపాతీ పిండిని నూనె రాసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా చేస్తే నీరు పిండికి పట్టుకుంటుంది. ఫలితంగా పిండి మృదువుగా తయారవుతుంది.
పిండిని ఊరానివ్వాలి
సమయం సరిపోకపోవడం వల్లనో లేదా ఇతర ఏదైనా చిన్న చిన్న కారణాల వల్లనో చాలామంది చపాతీలను పిండి కలిపిన వెంటనే చేసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చపాతీలు మెత్తగా రావు. అయితే పిండి కనీసం ఒక పది నిమిషాల పాటు కలుపుకోవాలి. కలిపేసి తరువాత కనీసం ఒక గంటపాటు పక్కన పెట్టుకోవాలి. లేదా రాత్రికి పిండిని కలుపుకొని ఉదయం చేసుకోవచ్చు.
ఇలా చేయడం వల్ల చపాతీ పిండి మంచిగా ఊరి, అద్భుతమైన మల్లెపువ్వు లాంటి చపాతీలు వస్తాయి. ఈ టిప్స్ పాటించడం వల్ల మీరు వంట గదిలో రాణి అవుతారు. చపాతీలు మెత్తగా దూదిలాగా రావడంతో పాటు ఎంతో రుచికరంగా ఉంటాయి. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి. వర్క్ అయితే మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications