Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక
వేసవి కాలం వచ్చిందంటే చాలు, మనందరికీ ముందుగా గుర్తొచ్చేది నిమ్మకాయలే. మండుటెండల బారి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి చల్లని నిమ్మకాయ షర్బత్ లేదా నిమ్మకాయ నీళ్లు తాగడానికి అందరూ ఇష్టపడతారు. దీనివల్ల వేసవిలో నిమ్మకాయలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే, చాలామంది ఒక్కసారిగా ఎక్కువ సంఖ్యలో నిమ్మకాయలను కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటారు.

కానీ ఎండల తీవ్రత వల్ల అవి త్వరగా ఎండిపోతుంటాయి. ఇలా ఎండిన నిమ్మకాయలు ఇక దేనికీ పనికిరావని, వాటిలోని రసం పూర్తిగా పోయిందని భావించి చాలామంది చెత్తబుట్టలో పారేస్తుంటారు. కానీ ఇకపై అలా చేయకండి. ఎందుకంటే, ఆ ఎండిన నిమ్మకాయలతో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన నల్ల నిమ్మకాయ ఊరగాయ తయారు చేయవచ్చు. తీపి, పులుపుల అద్భుతమైన కలయికతో ఉండే ఈ ఊరగాయ నోటికి ఎంతో రుచిని ఇవ్వడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
నిమ్మకాయ ఊరగాయ తయారకి కావాల్సిన పదార్థాలు
నిమ్మకాయలు - 500 గ్రాములు (ఎండినవి లేదా మామూలువి)
చక్కెర- 500 గ్రాములు
ఉప్పు - 3 టీస్పూన్లు
నల్ల ఉప్పు- 1 టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
వాము - 3 టీస్పూన్లు
యాలకుల గింజలు - కొద్దిగా

నిమ్మకాయ ఊరగాయ తయారీ విధానం
-ముందుగా మీరు తీసుకున్న నిమ్మకాయలను నీటిలో శుభ్రంగా కడగాలి. వాటిపై ఎలాంటి దుమ్ము లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక పొడి, శుభ్రమైన కాటన్ గుడ్డను తీసుకుని నిమ్మకాయలను తడి లేకుండా పూర్తిగా తుడిచి, గాలికి కాసేపు ఆరబెట్టాలి. నిమ్మకాయలకు ఏమాత్రం తడి ఉన్నా ఊరగాయ పాడయ్యే ప్రమాదం ఉంది.
-నిమ్మకాయలు పూర్తిగా ఆరిన తర్వాత, ఒక్కో నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. తొక్కను తీయకూడదు, ఎందుకంటే ఊరగాయలో తొక్క కూడా ఎంతో రుచిని ఇస్తుంది. ఇప్పుడు ఈ ముక్కలకు సాధారణ ఉప్పును పట్టించి బాగా కలపాలి.
-ఉప్పు కలిపిన నిమ్మకాయ ముక్కలలో చక్కెర, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి,యాలకుల గింజలు,వాము వేసి.. అన్నీ ముక్కలకు పట్టేలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తడి లేని ఒక శుభ్రమైన గాజు జాడీలో భద్రపరుచుకోవాలి. ఈ సీసాపై మూతపెట్టి, వరుసగా 4- 5 రోజుల పాటు ఎండలో ఉంచాలి.
-ప్రతిరోజూ పచ్చడిని ఎండలో పెట్టే ముందు, జాడీలోని ఊరగాయను గరిటెతో ఒకసారి పైకి కిందకి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల చక్కెరకు ఎండ వేడి తగిలి కరిగి, నిమ్మకాయ ముక్కలు ఆ తీపిని పీల్చుకుంటాయి.
-4 లేదా 5 రోజుల తర్వాత తీసి చూస్తే చక్కెర పాకంలా మారి ముక్కలు మెత్తబడి కమ్మని వాసనతో నల్ల నిమ్మకాయ ఊరగాయ రెడీ.
-అంతే ఎంతో సులభంగా పారేస్తామనుకున్న నిమ్మకాయలతో అద్భుతమైన రెసిపీ రెడీ. దీనిని వేడి వేడి అన్నం మరియు పప్పుతో కలిపి తింటే ఆ రుచే వేరు. అలాగే పరాఠా, చపాతీ, పెరుగన్నంలోకి కూడా ఇది సూపర్ సైడ్ డిష్‌గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications