Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!
మన ఇళ్లలో తరచుగా రాత్రి చేసిన చపాతీలు లేదా రోటీలు ఉదయానికి మిగిలిపోవడం చాలా సహజం. చల్లారిపోయిన వాటిని మళ్లీ తినడానికి ఎవరూ ఆసక్తి చూపించరు. చాలామంది అవి పాడైపోయాయనో, గట్టిగా ఎండిపోయాయనో చెత్తబుట్టలో పారేస్తుంటారు.
కానీ ఇకపై అలా చేయకండి. ఎందుకంటే ఆ మిగిలిపోయిన చపాతీ, రోటీలతోనే నోరూరించే, కరకరలాడే కట్లెట్స్ తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
చపాతీ లేదా రోటీలు: 4
ఉడికించిన బంగాళదుంపలు: 2
1 చిన్న క్యారెట్ తురుము
సగం క్యాప్సికమ్ తురుము
1 ఉల్లిపాయ ముక్కలు
అర టీస్పూన్ కారం
అర టీస్పూన్ గరం మసాలా
అర టీస్పూన్ ఆమ్చూర్ పౌడర్
రుచికి సరిపడా ఉప్పు
2 టీస్పూన్ల శనగపిండి లేదా బొంబాయి రవ్వ
పచ్చిమిర్చి: 1 లేదా 2
కొత్తిమీర తరుగు: 2 టీస్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
నూనె: వేయించడానికి
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా..
తయారీ విధానం
-ముందుగా మిగిలిపోయిన చపాతీ లేదా రోటీలను చేత్తో చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. వీటిని మిక్సీ జార్ లో వేసి కాస్త బరకగా రవ్వలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చపాతీ లేదా రోటీ పొడి, మెత్తగా చేసిన బంగాళదుంపల గుజ్జు వేయాలి. ఆ తర్వాత అందులోనే తురుముకున్న క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత ఇందులోనే కారం, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. కట్లెట్స్ నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉండటానికి బైండింగ్ కోసం శనగపిండి లేదా బొంబాయి రవ్వను కలపాలి.
-అన్ని పదార్థాలు చక్కగా కలిసేలా చేత్తో బాగా ఒత్తుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఒకవేళ పిండి మరీ పొడిగా అనిపిస్తే, ఒకటి లేదా రెండు స్పూన్ల నీళ్లు చిలకరించి కలుపుకోవచ్చు.
-మీ అరచేతులకు కొద్దిగా నూనె రాసుకుని, సిద్ధం చేసుకున్న
మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. మీకు నచ్చిన ఆకారంలో
గుండ్రంగా, ఓవెల్ షేప్ లేదా టిక్కీల్లాగా అందంగా ఒత్తుకోవాలి
.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, నాన్ స్టిక్ పాన్ పెట్టి 2-3 టేబుల్
స్పూన్ల నూనె వేడి చేయండి. మంటను మీడియంలో ఉంచి, తయారుచేసుకున్న
కట్లెట్లను పాన్ పై ఉంచాలి. రెండు వైపులా మంచి గోధుమ రంగు
వచ్చే వరకు, కరకరలాడేలా కాల్చుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, వేడి వేడి రోటీ కట్లెట్స్ రెడీ. వీటిని టొమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో వడ్డించండి. మిగిలిపోయిన చపాతీలతో ఇంత అద్భుతమైన వంటకం చేయవచ్చా అని తిన్నవారంతా ఆశ్చర్యపోవడం ఖాయం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
