Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా టేస్టీ నూడుల్స్ చేయండి!
చాలా ఇళ్లలో రాత్రి భోజనం చేయగా చపాతీలు లేదా రోటీలు మిగిలిపోతుంటాయి. ఉదయం లేవగానే చల్లారిపోయిన ఆ చపాతీలను తినలేక, అలాగని పారేయలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఇకపై ఆ చింత వదిలేయండి. ఎందుకంటే మిగిలిపోయిన ఆ చపాతీలతో అద్భుతమైన, రుచికరమైన నూడుల్స్ తయారు చేసుకోవచ్చు.
సాధారణంగా బయట దొరికే నూడుల్స్ మైదాతో చేస్తారు కాబట్టి అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. కానీ మన ఇంట్లో గోధుమ పిండితో చేసిన చపాతీలతో ఈ నూడుల్స్ చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ ఇష్టపడే మీ పిల్లలు ఒక్కసారి ఈ చపాతీ నూడుల్స్ రుచి చూశారంటే.. మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు.

చపాతీ నూడుల్స్ తయారీకి కావలసిన పదార్థాలు
చపాతీలు - 3
వెల్లుల్లి రెబ్బలు - 4
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
అల్లం - చిన్న ముక్క
క్యారెట్ ముక్కలు - అర కప్పు
క్యాప్సికమ్ ముక్కలు - అర కప్పు
మిరియాల పొడి - చిటికెడు
చక్కెర - ఒక టీస్పూన్
రెడ్ చిల్లీ సాస్ - 1 టీస్పూన్
సోయా సాస్ - 1 టీస్పూన్
వెనిగర్ - 1 టీస్పూన్
టొమాటో కెచప్ - 2 టీస్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
కొత్తిమీర - కొద్దిగా
చపాతీ నూడిల్స్ తయారీ విధానం
-ముందుగా మిగిలిపోయిన చపాతీలను తీసుకుని వాటిని రోల్ చేసి, కత్తితో సన్నని నూడుల్స్ లాగా పొడవుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ చపాతీ ముక్కల మీద కొద్దిగా నూనె, చిటికెడు ఉప్పు చల్లి పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల అవి ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించండి. ఇవి దోరగా వేగి కమ్మటి వాసన వస్తున్నప్పుడు, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలపండి. ఉల్లిపాయలు కాస్త రంగు మారాక, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించండి. కూరగాయలు మరీ మెత్తగా ఉడికిపోకూడదు, కాస్త క్రంచీగా ఉంటేనే నూడుల్స్ కు అసలైన రుచి వస్తుంది.
-కూరగాయలు కాస్త వేగాక.. మంటను కొద్దిగా తగ్గించి, అందులో చిటికెడు మిరియాల పొడి, ఒక టీస్పూన్ చక్కెర, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, టొమాటో కెచప్ వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. సాస్ లలో ఉప్పు ఉంటుంది కాబట్టి, చూసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి.
-సాస్ మిశ్రమం ఉడుకుతున్న సమయంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ నూడుల్స్ అందులో వేయండి. మసాలా, సాస్ అంతా చపాతీ ముక్కలకు పట్టేలా రెండు నిమిషాల పాటు నెమ్మదిగా, జాగ్రత్తగా కలపండి. అంతా బాగా కలిశాక స్టవ్ ఆఫ్ చేయండి. అంతే చపాతీ నూడుల్స్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications