Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
10 నిమిషాల్లోనే కారం అన్నం..బిర్యానీ,పులావ్ లు కూడా దీని ముందు జుజుబీ..నోటికి పట్టిన తుప్పు అంతా వదిలిపోతుంది!
భారతీయ వంటిళ్లలో, ముఖ్యంగా తెలుగు వారి ఇళ్లలో అన్నం ప్రధాన ఆహారం. మధ్యాహ్నం వండిన అన్నం రాత్రికి లేదా రాత్రి వండిన అన్నం ఉదయానికి మిగిలిపోవడం సర్వసాధారణం. చాలామంది ఈ అన్నాన్ని పారేయలేక, ఏం చేయాలో తెలియక నిమ్మకాయ పులిహోర లేదా పెరుగన్నం చేస్తుంటారు.
కానీ ఎప్పుడూ ఒకే రకమైన రుచి బోర్ కొడుతుంది కదా? అందుకే, అన్నం వృధా కాకుండా, జిహ్వకు సరికొత్త రుచిని అందించే అద్భుతమైన వంటకం కారం రైస్. జలుబు, దగ్గు ఉన్నప్పుడు లేదా నోటికి రుచి తెలియనప్పుడు ఈ కారం రైస్ తింటే చాలా ఉపశమనంగా ఉంటుంది. ముఖ్యంగా సమయం లేనప్పుడు, ఒంట్లో బాగులేనప్పుడు, లేదా వంట చేసే ఓపిక లేనప్పుడు 10 నిమిషాల్లో చేసుకోగలిగే బెస్ట్ రెసిపీ ఇది. కారం అన్నం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడడి.

కావలసిన పదార్థాలు
-మిగిలిపోయిన అన్నం
-ఎండు మిరపకాయలు
జీలకర్ర
-కరివేపాకు
-నూనె
-ఆవాలు
-మినప్పప్పు
-పచ్చి శనగపప్పు
-వేరుశెనగ గుళ్లు (పల్లీలు)
-ఉప్పు
-పసుపు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కారం
తయారీ విధానం
-మిగిలిపోయిన అన్నం గడ్డలుగా ఉంటే, చేతితో నలిపి పొడిపొడిగా చేసుకోవాలి. అన్నం మరీ మెత్తగా ఉంటే కారం రైస్ ముద్దగా అయిపోతుంది, కాబట్టి అన్నం పలుకుగా ఉండేలా చూసుకోండి.
-ఒక గిన్నెలోకి మిగిలిపోయిన అన్నం తీసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు, మీ రుచికి తగ్గట్టుగా కారం, చిటికెడు అల్లంవెల్లుల్లి పేస్ట్, రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసి మొత్తం అంతా బాగా కలిసేలా చేతితో కలుపుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఈ అన్నంలోకి తాలింపు పెట్టుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చెయ్యాలి. ఇందులో తాలింపు గింజలు, పల్లీలు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
-తాలింపు వేగిన తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ ని వేసి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేయండి. చివరగా ఉప్పు సరిచూసుకోండి.
-స్టవ్ ఆపే ముందు ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపితే, ఆ ఘాటుకు నెయ్యి కమ్మదనం తోడై రుచి అమోఘంగా ఉంటుంది. కొత్తిమీర చల్లుకుని దించేయండి.
-అంతే సూపర్ టేస్టీ కారం అన్నం రెడీ. దీనిని వేడి వేడిగా పొగలు కక్కుతున్నప్పుడే తింటే నోటికి స్వర్గం కనబడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications