Latest Updates
-
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది!
అన్నం మిగిలిందా?..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీగా మినపప్పు అన్నం..ఎలా చేసుకోవాలంటే
మిగిలిపోయిన అన్నంతో పులిహోరా,టమాటో రైస్,వడలు,దోశ వంటి తయారుచేసుకునే బదులు ఒక్కసారి మినపప్పు అన్నం ట్రై చేయండి. పాతకాలం నాటి తెలుగోళ్ల వంటకం ఇది. లంచ్ బాక్సుల్లోకి కూడా ఇది పర్ఫెక్ట్ గా ఉండే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం ఇది. దీనిని అల్పాహారంగా లేదా తేలికపాటి భోజనంగా తీసుకుంటే ఆరోగ్యకరమైన, రుచికరమైన అనుభూతిని పొందవచ్చు. ఈ వంటకంలో నెయ్యి లేదా నూనెను మితంగా వాడటం ద్వారా దీని ఆరోగ్య ప్రయోజనాలను మరింత పెంచుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో మినపప్పు రైస్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
మినపప్పు అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
-నెయ్యి
-మిగిలిపోయిన అన్నం
-పొట్టు మినపప్పు
-ఆవాలు
-జీలకర్ర
-చింతపండు
-ధనియాలు
-పచ్చి కొబ్బరి
-ఎండుమిర్చి
-ఇంగువ
-కరివేపాకు
-ఉప్పు

మినపప్పు అన్నం తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసి ఇందులో పావు కప్పు పోట్టు మినపప్పు వేసి మంచి సువాసన వచ్చేదాకా వేయించాలి.
-తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 8 ఎండుమిర్చి వేసి అది వేగిన తర్వాత అందులో పావు కప్పు పచ్చికొబ్బరి ముక్కలు వేసి మెత్తగా అయ్యేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.
-ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేయండి. ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మాద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి ఇందులో 1 టీస్పూన్ ఆవాలు వేసి చిట్లనివ్వాలి. ఇప్పడు అందులో 1 టీస్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, చిటికెడు ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి వేపాలి.
-ఇప్పుడు అందులో గ్రైండ్ చేసుకున్న పొడి వేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
-ఇప్పుడు మిగిలిపోయిన అన్నంలో అయినా లేదా పొడి పొడిగా ఉన్న వేడి అన్నంలో అయినా వేసి కలపండి. అంతే మినపప్పు అన్నం రెడీ.
కొన్ని ప్రయోజనాలు
మినపపప్పు.. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు (ముఖ్యంగా B కాంప్లెక్స్),
మినరల్స్ (ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం) అద్భుతమైన మూలం.
అన్నం..కార్బోహైడ్రేట్లను అందిస్తుంది, ఇది శరీరానికి తక్షణ శక్తిని
ఇస్తుంది. ఈ వంటకం ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, సూక్ష్మపోషకాలతో కూడిన
సమతుల్యమైన భోజనాన్ని అందిస్తుంది. రోజంతా చురుకుగా ఉండటానికి, అలసటను
తగ్గించడానికి సహాయపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications